బొమ్మల రూపంలో కథలు

బొమ్మల రూపంలో కథలు

ఒక కథని బొమ్మల రూపంలో చెప్పడం కామిక్స్​ స్పెషాలిటీ. మన దేశంలో కూడా కొన్ని  కామిక్స్​ బుక్స్​ వచ్చాయి. ఇప్పుడు జనరేషన్​ మారింది కనుక ఈ కామిక్స్​ బుక్స్​ కూడా డిజిటల్​ అయిపోయాయి​. ఇలాంటివే యూట్యూబ్​లో కనిపిస్తున్న ‘అమ్మాచిస్​ అమేజింగ్ మెషిన్స్​​’ . ఇందులో కథలోని ప్రతి లైన్​కు ఒక బొమ్మ, డైలాగ్​ ఉంటాయి. అంతేకాదు, బ్యాక్​గ్రౌండ్​లో ఆ డైలాగ్​ వినిపిస్తుంది కూడా. ఈ వాయిస్​ ఓవర్​ వస్తున్నప్పుడు ఏ మాట పలుకుతారో.. అవి కలర్​లో హైలైట్​ అవుతాయి. ఈ కొత్త తరహా కామిక్స్ తెచ్చిన వాళ్లే ప్రియ కురియన్, రాజీవ్​ . పుట్టి పెరిగిన ఊరు, చుట్టుపక్కల మనుషులు, వాతావరణమే ప్రియ, రాజీవ్​​ ఆర్ట్​ వర్క్​కి ఇన్​స్పిరేషన్. చిన్నప్పటి నుంచి ఇద్దరికీ బొమ్మల పుస్తకాలంటే మస్త్ ఇష్టం. దాంతో పెద్దయ్యాక యానిమేషన్​ కోర్స్​ చేసి, ఇలుస్ట్రేటర్స్​గా మారారు. వీళ్లిద్దరూ కేరళకు చెందినవాళ్లు. కానీ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. ఈ మధ్యే ఇ–బుక్స్​ కూడా తెచ్చారు.

ఫైనల్ ఇయర్​లోనే మొదటి పుస్తకం 

‘సాహిత్యంలో పిల్లల పుస్తకాలు కూడా ముఖ్యమైనవే’ అంటున్న ప్రియకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే యానిమేషన్​ కోర్స్​లో ఇలుస్ట్రేషన్​ ఆర్ట్ చదివింది. అప్పుడే తనకి పిల్లల కథల పుస్తకాలకి బొమ్మలు వేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో తన యానిమేషన్​ వర్క్​ని చెన్నైలోని ‘తులిక బుక్స్​’ కి పంపించింది.  వాళ్లకు అవి బాగా నచ్చడంతోఒక పుస్తకానికి బొమ్మలు వేసే అవకాశం ఇచ్చారు. ఫైనల్ ఇయర్​లో ఉండగానే పిల్లల కథల పుస్తకానికి ఇలుస్ట్రేటర్​గా పనిచేసింది. ఆ బుక్ పాపులర్ కావడంతో మరిన్ని బుక్స్​కి బొమ్మలేసే ఛాన్స్ వచ్చింది ప్రియాకు.  కథలోని క్యారెక్టర్లు, వాటి రూపురేఖల్ని బట్టి ఇలుస్ట్రేషన్స్ వేస్తుంది. ఒక చిన్న ఏనుగు పిల్ల మీద వచ్చిన ‘ఐ యామ్ సో స్లీపీ’, బామ్మ క్యారెక్టర్​తో వచ్చిన ‘అమ్మాచిస్​ గ్లాసెస్’  పుస్తకాలు ప్రియని పాపులర్ చేశాయి. ఇప్పటివరకు 60 పుస్తకాలకి బొమ్మలేసింది ప్రియ.