స్కూల్ పిల్లల కోసం టెలిస్కోప్ చేసిండు

స్కూల్ పిల్లల కోసం టెలిస్కోప్ చేసిండు

బెంగళూరుకు చెందిన హిమాన్షుకి  సైన్స్ అంటే ఇష్టం. నక్షత్రాలు, పాలపుంత గురించి  టీచర్ చెప్తుంటే ఆసక్తిగా వినేవాడు. ఆ ఇష్టంతోనే ఇంజినీరింగ్​కి వచ్చాక స్కూల్ పిల్లల కోసం టెలిస్కోప్​ తయారుచేశాడు. నక్షత్రాలు, గ్రహాల గురించి మరింత తెలుసుకునేందుకు.. ‘అసోసియేషన్ ఆఫ్​ బెంగళూరు అమెచ్యూర్ ఆస్ట్రోనామర్స్​’ (ఏబీఏఏ)లో మెంబర్​గా చేరాడు.  అక్కడ నక్షత్రాల్ని టెలిస్కోప్​లో చాలా దగ్గరగా  చూశాడు. తను కూడా అలాంటి టెలిస్కోప్​  తయారు చేయాలనుకున్నాడు. 4 వారాలు కష్టపడి ‘న్యూటోనియన్ టెలిస్కోప్’ తయారు చేశాడు. ఇదొక రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్. దీని ఫోకల్ లెంత్​ 35 ఇంచులు. దీనిలో 32ఎం.ఎం, 20 ఎం.ఎం ఆక్యులార్ లెన్స్​లు ఉన్నాయి. ఈ టెలిస్కోప్​తో శని, బృహస్పతి గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాల్ని చూడొచ్చని చెప్తున్నాడు హిమాన్షు. 

స్కూల్లో వర్క్​షాప్

‘‘సెప్టెంబర్​లో ఇంటిదగ్గర... పీవీసీ పైప్, పారాబోలిక్, ఫ్లాట్ మిర్రర్స్​ వాడి టెలిస్కోప్ తయారుచేశా. టెలిస్కోప్ గురించి చెప్పడం కోసం స్కూల్లో వర్క్​షాప్​ పెట్టా. విడిభాగాలు ఒక్కోటి అమర్చుతూ టెలిస్కోప్​ తయారీని వివరించా” అంటున్నాడు హిమాన్షు.