స్టైరిన్ గ్యాస్ ప్రభావ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

స్టైరిన్ గ్యాస్ ప్రభావ లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

స్టైరిన్ గ్యాస్ భారిన పడి వెంకటాపురంలో 9 మంది చనిపోగా.. 200 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఆ ప్రాంతమంతా విషవాయువుతో నిండిపోయింది. ఆ గ్యాస్ భారిన పడిన వారిని గుర్తించాలంటే.. వారిలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చూడండి.

స్టైరిన్ గ్యాస్ ప్రభావ లక్షణాలు

  • చర్మం, కళ్ళు మంటలు రావడం.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
  • నోటి నుంచి, ముక్కు నుంచి నురగలు రావడం.
  • కండరాల బలహీనత.
  • అపస్మారక స్థితికి వెళ్ళడం.
  • కేంద్రీయ నాడీ వ్యవస్థ పనితీరు మందగించటం.
  • పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యం కోసం సంప్రదించండి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • బాధితులను ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్ళండి.
  • కళ్లను, శరీరాన్ని సబ్బు నీటితో కడగండి.
  • తడి గుడ్డని మాస్క్ లా కట్టండి.
  • బాధితునికి వెంటనే ఆక్సిజన్ అందించగలిగితే ప్రాణాపాయం తక్కువగా ఉంటుంది.
  • వీలయితే బాధితుని ఒంటిమీది దుస్తులు మార్చండి.
  • విషవాయువు లక్షణాలు కనిపించిన వారి చుట్టూ గుమికూడకుండా.. వారికి గాలి అందేలా చూడండి.
  • కంగారుగా పరిగెత్తకుండా.. వాహనాలలో మాత్రమే ప్రయాణం చేయండి.
  • అనుక్షణం అప్రమత్తంగా ఉండండి.