ప్రాజెక్టు కట్ట కుంగడం మంచిదే: సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్

ప్రాజెక్టు కట్ట కుంగడం మంచిదే: సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలోని బోయినిపల్లి మండలం మన్వాడ వద్ద నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేర్) ప్రాజెక్టు కట్ట పై వేసిన తారురోడ్డు పలు చోట్ల కుంగింది. గ‌తంలో 2016 లో కూడా మిడ్ మానేర్ కట్ట తెగింది. 2019 లో ప్రాజెక్టు ఎడమ కట్టకు భోగమర్రి ఒర్రె ప్రాంతంలో సీపెజీ లు రావడంతో అధికారులు కట్టకు 200 మీటర్ల మేర మరమ్మత్తులు చేసి ప్రాజెక్టు లో పూర్తి స్థాయిలో నీటిని నింపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.68 టిఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే ప్రాజెక్టు కట్ట పై వేసిన రోడ్డు కుంగడంతో మళ్లీ ప్రజల్లో ఆందోళన మొద‌లైంది

దీనిపై మిడ్ మానేరు ప్రాజెక్టు సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్ శ్రీకాంత్ రావు వివరణ ఇస్తూ.. కట్ట కుంగడం సాధారణం.. నూతనంగా నిర్మించిన కట్ట కుంగడం మంచిదే, అందులో భయపడాల్సింది ఏమీ లేదు అని అన్నారు. కట్ట నిర్మించేప్పుడు నూరు శాతం రోలింగ్ కాదని ఆ సమయంలో 98% రోలింగ్ అవుతుందని, ఇప్పుడు మరో 2% రోలింగ్ అవుతుందని చెప్పారు. మళ్లీ దానిపై తారు రోడ్డు వేస్తామ‌ని అన్నారు.

sri rajarajeswara project