తమిళనాడుకు తుపాను ముప్పు…తెలుగు రాష్ట్రాల్లో జల్లులు

తమిళనాడుకు తుపాను ముప్పు…తెలుగు రాష్ట్రాల్లో జల్లులు

తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నాటికి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతానికి ఆగ్నేయంగా అల్పపీడనం ఏర్పడుతుందని, క్రమంగా అది వాయుగుండంగా మారుతుందన్నారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వాయుగుండం తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని, ఈ సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు.

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. హిందూమహా సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వచ్చే 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారుతుందని, క్రమంగా బలపడి వాయుగుండం మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో శ్రీలంకకు ఆగ్నేయంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేశారు. ఇది రానున్న 36 గంటల్లో బలపడి వాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు.