టీచర్ల కేటగిరీలు ఫైనల్

టీచర్ల కేటగిరీలు ఫైనల్
  • సాంక్షన్డ్, ఖాళీలపై స్పష్టత

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్​లో టీచర్ల కేటగిరీలు ఫైనలయ్యాయి. గతంలో 155 కేటగిరిలుంటే, ప్రస్తుతం 300లకు పైగా పెరిగాయి. టీచర్ల క్యాడర్ స్ర్టెంత్​పై సోమవారం అర్ధరాత్రి వరకు డీఈవోలు డైరెక్టరేట్​లోనే ఉండి వర్క్ చేశారు. ఉమ్మడి జిల్లాలు, కొత్త జిల్లాల టీచింగ్, నాన్ టీచింగ్ వివరాలను ఫైనల్ చేస్తూ సర్టిఫై చేసి డైరెక్టర్​కు పంపారు. ప్రస్తుతం డీఈవోలు ఇచ్చిన వివరాలను డైరెక్టరేట్​లో మరోసారి వెరిఫై చేస్తున్నారు. తర్వాత రెండు, మూడ్రోజుల్లో వీటిని సర్కారుకు పంపనున్నారు.

కాగా, స్కూల్ ఎడ్యుకేషన్​ పరిధిలోని టీచింగ్, నాన్ టీచింగ్ సాంక్షన్ పోస్టులు, వర్కింగ్ పోస్టుల వివరాలను సేకరించారు. దీంతో కొత్త జిల్లాల అలకేషన్​కు లైన్ క్లీయర్ అయింది. ప్రస్తుతం కేటగిరీల మార్పుపైనే ఆఫీసర్లంతా దృష్టి పెట్టారు. గతంలో స్కూల్ అసిస్టెంట్​ ఒకే  కేటగిరీ ఉండగా, తర్వాత గవర్నమెంట్, లోకల్​ బాడీ కేటగిరీలుగా మార్చారు.

ప్రస్తుతం సబ్జెక్ట్, మీడియం వారీగా మొత్తం 42 కేటగిరీలుగా మారినట్టు తెలిసింది. ఎస్జీటీల్లో ఏడు కేటగిరీలు, పీఈటీల్లో ఏడు కేటగిరీలుగా మార్చినట్టు సమాచారం. హెడ్​మాస్టర్ కేటగిరీ మాత్రమే ఒక్కటిగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మంగళవారం నాటికి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల వివరాలు ఫైనల్ చేసినట్టు తెలిసింది. హెడ్ ఆఫీస్ ల పరిధిలోని పోస్టులపై ఇంకా వివరాలు తీసుకోలేదు.