హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే

 హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే

హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. దీంతో ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు(మే 16)న సన్‌రైజర్స్‌ ,  గుజరాత్ జట్ల మధ్య  జరగనున్న కీలక మ్యాచ్ పైన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.  వర్షం పడుతుండటంతో ముందు జాగ్రత్తగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు గ్రౌండ్‌ సిబ్బంది.  మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ అయితే  స్టేడియానికి క్యూ కడుతున్నారు. మరి వాళ్ల ఆశలను వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి. 

ప్లే ఆఫ్‌ చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో సన్‌రైజర్స్‌ జట్టు ఉంది. అటు ఇప్పటికే గుజరాత్ జట్టు లీగ్‌ నుంచి నిష్ర్కమించింది. కానీ  సన్‌రైజర్స్‌ పై గెలిచి  విజయంతో లీగ్‌ను ముగించాలని చూస్తోంది.  ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌ జట్టు 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.  గుజరాత్ జట్టు 13 మ్యాచుల్లో 11 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.