
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఘట్ కేసర్ , నర్సంపేట, గోదావరిఖని, జడ్చర్ల, మెదక్ లాంటి ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఘట్ కేసర్ లో డయాబెటిస్ కు ఆయుర్వేద ఔషధంగా అల్లోపతి డ్రగ్ పౌడర్ మిక్స్‌ను అమ్ముతున్న రాకెట్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు ఛేదించారు. లక్షన్నర రూపాయల విలువైన మందులను అధికారులు సీజ్ చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలో జెన్ బాక్ట్ ఆయింట్మెంట్తో పాటుగా గోదావరిఖనిలో తేమెన్ ఇంజక్షన్స్ ని MRP కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్న మెడికల్ షాప్ లను అధికారులు సీజ్ చేశారు. జడ్చర్లలో తప్పుదోవ పట్టించే ప్రకటనలతో అమ్ముతున్న ఆయుర్వేద ఔషధం ఫెమిజోయ్ సిరప్ ను అధికారులుస్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ గ్రామంలోని ఆర్ఎంపి పద్మావతి క్వాక్ క్లినిక్ పై అధికారులు దాడులు నిర్వహించారు. 70వేల రూపాయల విలువ గల 40రకాల మెడిసిన్స్ ను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.