ప్రభుత్వంపై పోరు: రేపటి నుంచే కాంగ్రెస్ పాదయాత్ర…

ప్రభుత్వంపై పోరు: రేపటి నుంచే కాంగ్రెస్ పాదయాత్ర…

సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్  పార్టీ రెడీ అయ్యింది. ఇందులో భాగంగా మూడు యాత్రలు ప్లాన్ చేసింది. పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రంగారెడ్డి కాంగ్రెస్ నేతలు వేరువేరుగా యాత్రల్లో పాల్గొంటునున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాత్ర రేపు నల్గొండలో ప్రారంభం కానుంది. జిల్లా ప్రజలకు తాగు, సాగు నీరందించే ఉదయసముద్రం–బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం కోసం రైతుసాధనయాత్ర పేరుతో కోమటిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.

నాలుగు రోజుల పాటు జరిగే ఈయాత్రలో 5వేల మంది రైతులతో కలిసి కోమటిరెడ్డి 100 కిలీమీటర్లు నడుస్తారు. ఇక పీసీసీ ఆధ్వర్యంలో ఉత్తమ్  యాత్ర కూడా రేపే ప్రారంభం కానుంది. అవినీతి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారంటూ ఉత్తమ్ యాత్ర చేపడుతున్నారు. ఈయాత్రలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రద్దుకు నిరసనగా ఎల్లుండి నుంచి రంగారెడ్డి జిల్లా నేతలు పాదయాత్ర చేయనున్నారు.