బాలామృతం నాణ్యత పెంచుతాం తెలంగాణ ఫుడ్స్ ​బృందం వెల్లడి

బాలామృతం నాణ్యత పెంచుతాం తెలంగాణ ఫుడ్స్ ​బృందం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫుడ్స్​బృం దం రెండు రోజుల‌‌‌‌‌‌‌‌ గుజరాత్ పర్యటనలో భాగంగా మొదటిరోజు శుక్రవారం కైరా జిల్లా ఆనంద్‌‌‌‌‌‌‌‌లోని అమూల్ టెక్ హోం రేషన్ ఫ్యాక్టరీని సందర్శించింది. ఈ సందర్భంగా ఫుడ్స్​ చైర్మన్ ​మేడె రాజీవ్​సాగర్ మాట్లాడుతూ..​అమూల్ ఫ్యాక్టరీలో వినియోగిస్తున్న యంత్రాలు, టెక్నాలజీ అధునాతనమైనవని తెలిపారు. ఆసియాలోనే తెలంగాణ ఫుడ్స్​కు అతిపెద్ద ప్లాంట్​ఉందని.. దీని ద్వారా బాల మృతం ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. 

గుజరాత్​లో వినియోగించే రోస్టర్లను మన రాష్ట్రంలో ప్రవేశపెడితే నాణ్యమైన పౌష్టికాహారం ఉత్పత్తి చేసి అందించవచ్చని వివరించారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో బాల శక్తి పేరుతో అందిస్తున్న బాలామృతం తయారీకి రూ.75 ఖర్చు అవుతుంటే మనకు రూ.50 మాత్రమే ఖర్చవుతుందని రాజీవ్​సాగర్ అన్నారు. ఆయన వెంట జీఎం విజయలక్ష్మి, ఏజీఎంలు శ్రీనివాస్​నాయక్, ఎలమంద ఉన్నారు.