కంటైన్మెంట్ జోన్లకు సర్కారు జారీ చేసిన గైడ్‌లైన్స్‌‌‌‌ ఇవే

కంటైన్మెంట్ జోన్లకు సర్కారు జారీ చేసిన గైడ్‌లైన్స్‌‌‌‌ ఇవే

హైదరాబాద్, వెలుగు:  కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రప్రభుత్వం కంటైన్‌ ‌‌‌మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. వైరస్ సోకకుండా ఆ జోన్లలో రోజువారీ నిర్వహణ ఎలా ఉండాలో మంగళవారం ప్రత్యేక గైడ్‌‌‌‌లైన్స్ విడుదల చేసింది. ఆ జోన్లనుంచి రానిం కె.. పోనింకె లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుం టామంది. రాకపోకలకు ఒక్కటే దారిని ఓపెన్‌‌‌‌చేస్తా మని చెప్పింది. 24 గంటలూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. జోన్‌‌‌‌పరిధిలో అందరికీ ఫీవర్‌ ‌‌‌టెస్టులు చేస్తారని పేర్కొంది. వైరస్‌ ‌‌‌పాజిటివ్‌‌‌‌ వస్తేవెంటనే గాంధీకి తరలిస్తామంది. జోన్‌‌‌‌లోని అందరికీ రోజూ మాస్కులు పంపిణీ చేస్తారని చెప్పింది. ఇంటిదగ్గరకే నిత్యావసరాలు వస్తాయని, ఇందుకు ప్రత్యేక వెహికల్స్‌ ‌‌‌ఉంటాయంది. చెత్త సేక రణకు ప్రత్యేక వ్యవస్థఉంటుందని పేర్కొంది. కరోనా కేసులెక్కువున్నజీహెచ్ఎంసీ పరిధిలో కంటైన్మెంట్ల ఏర్పాటు, నిర్వహణ, డిపార్టుమెంట్లు, అధికారుల డ్యూటీని స్పష్టంగా పేర్కొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్  పరిధిలో కేసులు నమోదైనా, పాజిటివ్ వచ్చిన వారితో ప్రైమరీగా కాంటాక్ట్  మెంబర్ ఉన్నా బోర్డు సీఈవో ఆ వివరాలను జీహెచ్ఎంసీ కమి షనర్‌‌‌‌కు వెంటనే తెలియజేయాలంది. ‘వైరస్‌‌‌‌వ్యాప్తిని వీలైనంత తక్కువ చేయడం లక్ష్యంగా కంటైన్‌‌‌‌మెం ట్‌‌‌‌లను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్లఇండ్లున్న ప్రాంతాలు, కరోనా ఉన్న వ్యక్తుల ఇండ్లున్న ఏరియాను కంటె యిన్‌‌‌‌మెంట్‌‌‌‌గా గుర్తించాం. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా మున్సిపల్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొంది.

కంటైన్మెంట్ జోన్లకు సర్కారు జారీ చేసిన గైడ్‌లైన్స్‌‌‌‌ ఇవే..

కరోనా కేసులు నమోదైన వ్యక్తుల ఇం డ్లున్న ఏరియాను కంటైన్‌‌‌‌మెంట్‌‌‌‌గా గుర్తిస్తారు. కేసుల సంఖ్య ఆధారంగా జోన్ సరిహద్దులను నిర్ధారిస్తారు. పరిస్థితులను బట్టి జోన్ పరిధి 100 నుంచి 500 మీటర వరకు ఉంటుంది. కేసు నమోదైన ఇంటి చుట్టూవంద ఇండ్ల పరిధి లెక్కన జోన్ పరిధిని నిర్ణయిస్తారు.  ఇక్కడ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలు దీని పరిధిలో ఉంటాయి. జోన్‌ ‌‌‌ఏరియాలోని రోడ్లను మూసేస్తారు. జోన్ మొత్తానికి ఒక్కటే ఎంట్రీ, ఎగ్జిట్‌‌‌‌ గేట్ ఉంటాయి. జోన్ చుట్టూ 8 ఫీట్ల ఎత్తుతో బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి కంటైన్‌‌‌‌మెంట్‌ ‌‌‌జోన్‌‌‌‌కు బఫర్‌‌‌‌జోన్ ఉంటుంది. జోన్‌‌‌‌ను నిర్ణయించేటప్పుడు స్థానికులతో చర్చిస్తారు. జోన్‌‌‌‌ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర 24 గంటలు పోలీసు సిబ్బంది డ్యూటీ చేస్తారు. సరైన కారణం ఉండి, అధికారుల పర్మిషన్ ఉంటేనే జోన్‌‌‌‌నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. జోన్‌‌‌‌లోకి రాకపోకలన్నీ రికార్డ్ అవుతాయి. జోన్‌‌‌‌లోని వారెవరూ ఇండ్ల నుంచి బయటికి రావడం కుదరదు. ఇండ్ల ముందుండే ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై, ఇతర ప్లేస్‌‌‌‌ ల లోనూ నడవడానికి అనుమతి ఉండదు. హెల్త్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ మాస్కులను పంపిణీ చేస్తారు. జోన్‌‌‌‌ పరిధిలోని వాళ్లకు  అవసరమైన సరుకులు, వస్తువుల సరఫరాకు స్పెషల్ వాహనం ఉంటుంది. నిత్యావసర వస్తువులను ఇంటికి వద్దకు వెళ్లి ఇస్తారు. రోజూ మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరెవరికి ఏ సరుకులు అవసరమో లిస్ట్ సేకరిస్తారు. పాజిటివ్‌‌‌‌ కేసులున్న ఇండ్లకు పీపీపీ కిట్‌‌‌‌తో వెళ్లి సరుకులిస్తారు. జోన్ ఏర్పాటు, దాని పరిధిలో అమలు చేసే నిబంధనలను తెలిపేలా తెలుగు, ఉర్దూలో కరపత్రాలు పంపిణీ చేస్తారు. ఆటోను ఏర్పాటు చేసి రికార్డిం గ్ ఆడియోను వినిపిస్తారు. జోన్‌‌‌‌లో రోజు శానిటేషన్ నిర్వహిస్తారు. ఎప్పటికప్పడు చెత్తను తొలగిస్తారు. ప్రతిఇంట్లో  ఫీవర్ సర్వే చేస్తారు. జ్వరం లక్షణాలుంటే ఆస్పత్రికి తరలిస్తారు. పాజిటివ్ కేసులు నమోదైతే ప్రైమరీ కాంటాక్ట్ జాబితాను రూపొందిస్తారు. ఎక్కువ, తక్కువ రిస్క్ ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్ లేదా ఐసోలేషన్ చేస్తారు. జోన్ పరిధిలో ఇండ్లులేని వాళ్లుంటే నోడల్ ఆఫీసర్ చర్యలు తీసుకుంటారు.