ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షలు 2019 ఫిబ్రవరి 27 నుంచి మార్చి16 వరకు పరీక్షలు నిర్వహంచనున్నట్లు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 9.42 లక్షలు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా… ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,52,550  ఉండగా.. సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,90,169 ఉన్నారు.

ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు 4,09,090 ఉన్నారు. ఓకేషనల్ విద్యార్థులు 43,460. సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు (రెగ్యులర్) 3,82,996 పరీక్ష రాస్తుండగా… జనరల్ విద్యార్ధులు (ప్రైవేట్) 68,375 ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 1,277 సెంటర్లను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు.  పరీక్ష పర్యవేక్షణ కోసం 1,277 చీఫ్ సూపరింటెండెంట్లను నియమించింది. 24,508 ఇన్విజిలేటర్స్ ను అలాట్ చేసింది.

15 నిముషాల ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని బోర్డు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన వర్తిస్తుందన్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్ ఉంటుందని..ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమించబోమని తెలిపారు. 32 సెంటర్స్ ని సమస్యాత్మకంగా గుర్తించామన్న అధికారులు..ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో సెంటర్లకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని కోసం ఆర్టీసీ సహకారం తీసుకున్నట్లు చెప్పారు. పరీక్ష సెంటర్స్ కి చుట్టు పక్కన జిరాక్స్ సెంటర్లను మూసివేయించనున్నట్లు తెలిపారు. ఒకసారి స్టూడెంట్ పరీక్ష కేంద్రానికి ఎంటర్ అయితే పరీక్ష సమయం ముగిసే వరకు హాల్ నుండి బయటకు వెళ్లేందుకు అనుమతించబోమన్నారు. దీనికి సంబంధించి ఎంలాంటి అనుమానాలున్నా డెస్క్ నంబర్స్ కి కాల్ చేయాలని సూచించారు.