‘అపెక్స్‌‌’ను లైట్ తీస్కుంటే..మన నీళ్లకు గండే!

‘అపెక్స్‌‌’ను లైట్ తీస్కుంటే..మన నీళ్లకు గండే!
  • ఆ మీటింగ్ తోనే   ఇమ్మిడియెట్‌ ఎఫెక్ట్ ఉంటుందన్న ఇంజనీర్లు
  • న్యాయ పోరాటమూ అవసరమేగానీ.. అపెక్స్ను తక్కువగా చూడొద్దు
  • పాలమూరు, డిండిపై ఏపీ కంప్లైంట్‌ చేసినా కేంద్రం పంపిన జాబితాలో లేవు
  • అపెక్స్‌‌ పర్మిషన్‌తో అవి అధికారికం కావడమే కారణం
  • అందువల్ల అపెక్స్‌‌పై సర్కారు దృష్టి పెట్టాలని సూచనలు

ఏపీ తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ‌‌స్కీంకు ఇప్పటికిప్పుడు బ్రేకులు వేయాలంటే అపెక్స్‌  కౌన్సిలే మంచి వేదిక అని.. దాన్ని లైట్  తీసుకుంటే మననీళ్ళకు గండిపడినట్టేనని రిటైర్డ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని సూచిస్తున్నారు. కృష్ణా నీటి వాటాల్లో జరిగిన నష్టాన్ని న్యాయ పోరాటం ద్వారా సవరించుకోవాల్సిందేనని, కానీ అది ఇప్పటికిప్పుడు తేలేది కాదని అంటున్నారు . ఏపీ సర్కారు పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌స్కీంలు సహా పలు ప్రాజెక్టులపై కంప్లైంట్‌‌చేసిందని.. అయితే కేసీఆర్‌‌కు కేంద్ర మంత్రి రాసిన లేఖలో ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తావన లేదని గుర్తు చేస్తున్నారు . ఫస్ట్‌‌ అపెక్స్‌  కౌన్సిల్‌‌లో పాలమూరు, డిండి ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ వచ్చిందని, అందుకే వాటిపై ఏపీ చేసిన కంప్లైంట్ ను కేంద్రం పక్కన పెట్టిందని వివరిస్తున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ను తక్కువ చేసి చూపిస్తే ముందు నష్టపోయేది తెలంగాణ అనే విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు .

శ్రీశైలంఫోర్‌ షోర్‌ లోని సంగమేశ్వరంనుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకునేందుకు ఏపీ రాయలసీమ లిఫ్ట్‌స్కీం కు ఇప్పటికే టెండర్లుపిలిచింది. ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లోనూ క్లియరె క్లి న్స్‌ రావడం దాదాపు ఖాయమైంది. అన్ని పర్మిషన్లు తీసుకున్నాక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేసిన టెక్నికల్‌ కమిటీ సైతంసూచించింది. ఈ టెండర ప్రక్రియ పూర్తయితే ఏపీ తన జ్యూరిస్‌డిక్ష న్‌లో పట్టే ప్రాజెక్టునిర్మాణాన్ని అడ్డుకోవడం కష్టమే నని రిటైర్డ్‌ఇంజనీర్లుస్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఏపీకి బ్రేకులు వేయాల్సిఉందని, అందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. సుప్రీంలో తెలంగాణ పిటిషన్వేయడంమంచిదేనని..ఏపీ ముందు జాగ్రత్తగా దానిపై కేవియట్‌ పిటిషన్ వేసిందని గుర్తు చేస్తున్నారు. దీంతో న్యాయ ప్రక్రియ లేటవుతుందని చెప్తున్నారు. తమ జీవితకాలంమొత్తం ఏపీ అధికారుల పెత్తనంలో పనిచేశామని, సొంత రాష్ట్రంలో ఏపీ ప్రాజెక్టులను అడ్డుకునే అధికారం ఒక్కప్రభుత్వానికే ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

మనవన్నీ పాత ప్రాజెక్టులే..

అనుమతి తీసుకోవాలంటూ తమ లెటర్లో కేంద్ర మంత్రి సూచించిన కాళేశ్వరంలో తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోనే తలపెట్టినవని.. రాష్ట్రం ఏర్పాటయ్యాక రీడిజైన్‌ చేసుకున్నామని ఇంజనీర్లు అంటున్నారు. అదే విషయాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌కు అటెండ్‌ అయి చెప్తే సరిపోతుందని అంటున్నారు. కాళేశ్వరం 2 టీఎంసీల రలింపునకు అనుమతి ఇచ్చినట్టుకేంద్ర మే చెప్పిందని, అలాంటప్పుడు ఏపీ ఆ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన కేసుకు విలువ లేకుండా పోతుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మూడో టీఎంసీ తరలింపునకు పర్మిషన్‌ తీసుకోవాలని కేంద్రం సూచించడంలో ఎలాంటి తప్పు లేదని..అన్ని పర్మిషన్లు తీసుకొని, కేంద్ర సాయాన్ని కూడా కోరాలని సూచిస్తున్నారు. మిగతా ప్రాజెక్టులకు గతంలో వచ్చిన, ఇప్పటివరకు సాధించిన పర్మిషన్ల నుకేంద్రానికి సమర్పిస్తే.. వాటిపై వివాదాలు లేవనెత్తే అవకాశం ఏపీకి లేకుండా పోతుందని చెప్తున్నారు.

పాలమూరు, డిండిపై ఏపీ వాదన తేలిపోయింది

సంగమేశ్వరం లిఫ్ట్‌స్కీం , పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు లేటర్‌ విస్తరణ సహా 203 జీవోలోని ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేస్తే.. ఏపీ దానికి బదులుగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులపైనా కృష్ణా, గోదావరి బోర్డులకు కంప్లైంట్‌ చేసిందని రిటైర్డ్ఇంజనీర్లుగుర్తు చేస్తున్నారు. అయితే పాలమూరు– రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌స్కీం లపై ఏపీ ఫిర్యాదును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని చెప్తున్నారు. ఫస్ట్‌అపెక్స్‌ కౌన్సిల్‌లో పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌స్కీం లపై చర్చించి.. అవి ఉమ్మడి ఏపీలోనే చేపట్టినవేనన్న విషయాన్నికన్ఫామ్ చేశామని అంటున్నారు. ఈ విషయాన్నిజూన్‌ 4న నిర్వహించిన కృష్ణాబోర్డు మీటింగ్‌లోనూ ప్రస్తావించామని గుర్తు చేస్తున్నారు. బోర్డుఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగిందని.. వాటికి టెక్నికల్‌ అప్రైజల్‌ మాత్రమే తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సీఎం కేసీఆర్‌కు రాసిన లెటర్లో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల విషయాన్నే ప్రస్తావించలేదని.. ఫస్ట్‌అపెక్స్‌మీటింగ్ను పరిగణనలోకి తీసుకున్నందునే వాటిపై ఫిర్యాదును పక్కన పెట్టారని స్పష్టంచేస్తున్నారు. రెండో అపెక్స్‌ మీటింగ్కు వెళ్తే మిగతా ప్రాజెక్టులన్నీ చట్టబద్ధమవుతాయని.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర సాయం కోరాలి

తెలంగాణలో భూమి ఎక్కువ ఎత్తులో ఉందని,ఈ భూములకు నీళ్లివ్వాలంటే లిఫ్ట్‌స్కీములు తప్పమరో మార్గం లేదని రిటైర్డ్‌ఇంజనీర్లుచెప్తున్నారు.ఇందుకోసం చాలా ఖర్చుతో నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరాలని రాష్ట్రసర్కారుకు సూచిస్తున్నారు. ఏపీ ఎలాంటి పర్మిషన్లు లేకుండా చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్‌స్కీమ్‌కు సాయం చేయాలంటూ నీతి ఆయోగ్‌ను కోరిందని.. అలాంటప్పుడు అన్ని అనుమతులతో చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు సాయం కోరడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.