తిండిని బట్టే మన ఇమ్యూనిటీ

తిండిని బట్టే మన ఇమ్యూనిటీ

తిండి కొద్దీ ఎనర్జీ. ఇమ్యూనిటీ కూడా! బాగా తింటే బలంగా ఉండేది ఎంత నిజమో. ఫుడ్లో లోపాలుంటే ప్రాబ్లమ్స్ రావడం కూడా అంతే నిజం.తినే ఫుడ్ ఇష్టమైనదే.. అయినా కొన్నిసార్లు కష్టపెడతది. జీర్ణవ్యవస్థ పనికి అడ్డం పడతది. ఒక్కోసారి మేలు కంటే కీడు చేస్తుంది. హెల్దీగా ఉండాలంటే న్యూట్రిషనల్ ఫుడ్ తినడమే కాదు తినే టైం, ఫుడ్కాంబినేషన్, కుకింగ్, ఫుడ్ స్టోరేజ్ వంటి వాటి గురించి కేర్ తీసుకోవాలి. ఫుడ్ అలవాట్లన్నీ ఇమ్యూనిటీని సపోర్ట్ చేసేలా ఉంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు. డోంట్ కేర్ అనుకుంటే బాడీలో ఇమ్యూనిటీ పనైపోయినట్లే.

వెనకటివే ముద్దు

ఏ పదార్ధాలు ఏ పాత్రల్లో వండాలి, నిల్వ ఉంచాలోఉండేఅవగాహన ఉండాలి. వండటానికిమట్టిపాత్రలు, ఇత్తడి పాత్రలు బెటర్. రాగి పాత్రల్లో పు ల్ల టిపదార్థాలను వండకూడదు.ఆహారాన్ని నిల్వ ఉంచకూడదు.ఆహార పదార్థాల్లో ఉండే హైడ్రాక్సి  అబ్జార్బ్‌ చేస్తుంది. ఎక్కువ కాలం అల్యూమినియం పాత్రల్లో తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. నరాల పనితీరుపైనెగెటివ్ ప్రభావం పడుతుంది. ఇత్తడి పాత్రల్లో పు ల్లని పదార్థాలను వండకూడదు. పుల్లని ఆహారం నిల్వ ఉంచకూడదు. టిన్కోటింగ్, సింథటిక్స్ అప్లైచేసిన కళాయిల్లో వంటచేయకూడదు. మైక్రో ఓవెన్లోవేడి చేసినఫుడ్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. గ్రిల్స్ మీద వండినఫుడ్కు అర్బన్లో డిమాండ్ పెరుగుతోంది. బార్బెక్యూ క్యూజిన్ వంటకాల్లో కర్ర బొగ్గు మాత్రమే వాడాలి. రైల్వే బొగ్గు (శిలాజ బొగ్గు)అసలే వాడొద్దు.

కాంబినేషన్ కష్టాలు

రుచికోసం పోతే కొన్ని సార్లు అసలుకే (ఆరోగ్యానికే)మోసం రావొచ్చు. కొన్ని రకాల కాయగూరలు,ఆహార పదార్థాల కాంబినేషన్ జీర్ణవ్యవస్థకు , శరీరానికి పడదు.అలాంటి వాటిని విడివిడిగానే తీసుకోవాలి. పాలు, చేపలు కలిపి తినొద్దు. చేపలకూరతో భోజనం చేసినప్పుడులేదాతర్వాత పాలు, పాల ఉత్పత్తులు (పెరుగు,మజ్జిగమొదలైనవి) తినకూడదు. ఫిష్, పాలు కలిపి తీసుకుంటే విరేచనాలు ఎక్కువవుతాయి. పాలకూర,టొమాటో కలిపి వండితే కిడ్నీలకు మంచిదికాదు. కోడిగుడ్డు, పాలకూర కలిపి వండకూడదు. వీటిల్లో మి నరల్స్ ఎక్కువగాఉంటాయి.ఈ డిష్‌ వల్ల కిడ్నీల్లో రాళ్లు తయారవుతాయి. మూత్రనాళంలోయూరిక్యాసిడ్ పెరిగి, మంట పుడుతుంది.

లోకల్ రెసిపీస్

బెస్ట్ రోమ్లోరోమన్లాఉండాలన్నట్లు ఎక్కడ ఉంటేఅక్కడివాతావరణానికి అనుగుణంగాఫుడ్ తినాలి. లోకల్ ఫుడ్ తినేఅలవాటు ఉన్నవాళ్లు ఒక్కసారిగా మెనూమారిస్తే అజీర్తి చేస్తుంది. రెగ్యులర్గాతీసుకునే ఆహారానికి తగ్గట్టుగా జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది.ఒక్కసారిగాఫుడ్ హ్యాబిట్స్ మారిపోతే జీర్ణవ్యవస్థ సపోర్ట్ చేయలేదు. అందుకే జీర్ణసమస్యలు వస్తాయి.

ఇట్ల ఎప్పుడూ చేయొద్దు

ఆకలి లేనప్పుడుతినొద్దు.మొహమాట పడుతూతినొద్దు. నిల్వ ఉంచినఫుడ్ తినకూడదు. ఫ్రిజ్లోఉంచిన డ్రింక్స్,ఫ్రూట్స్,ఫుడ్ని బయటకు తీసిన వెంటనే తినకూడదు. ఫ్రిజ్లో నిల్వ చేసినకూరగాయలు నార్మల్ టెంపరేచర్కు వచ్చాకనే వండాలి. పాలు కూడా నార్మల్ టెంపరేచర్కి వచ్చాకనే వేడి చేయాలి.

డైట్ షెడ్యూల్

ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి తినడం. సూర్యోదయం కంటే ముందే లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం ఐదు, ఐదున్నర గంటల మధ్యలో లేస్తే.. ఎనిమిది గంటలు లేదా ఆ తర్వాత తినాలి. అందరికీ ఐదు గంటలకే నిద్ర లేవడానికి కుదరకపోవచ్చు. అందుకని నిద్ర లేచాక రెండు నుంచి మూడు గంటల మధ్య మాత్రమే తినాలి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో ఆకలి బాగా వేస్తుంది. మధ్యాహ్న భోజనం ఈ టైంలోనే చేయాలి. రాత్రిళ్లు హెవీగా తినడం, తినగానే పడుకోవడం వంటివి చేయకూడదు. ఎందుకంటే మనం నిద్రపోయే టైం వరకు తిన్న తిండి అరిగిపోవాలి. అందుకునే నిద్రపోయే టైం బట్టి సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య తినాలి. ఒకసారి భోజనం చేశాక మళ్లీ తినాలంటే మూడు నుంచి నాలుగు గంటల టైంగ్యాప్ ఉండాలి. టైం పాటించకపోవడమే లైఫ్ స్టయిల్ వ్యాధులకు ప్రధాన కారణం. వాటిని కంట్రోల్ చేయాలంటే డైట్కోసం షెడ్యూల్ని ప్లాన్ చేయడం తప్పనిసరి.