మ్యాథ్స్ టఫ్​.. కెమిస్ట్రీ ఈజీ

మ్యాథ్స్ టఫ్​.. కెమిస్ట్రీ ఈజీ

హైదరాబాద్, వెలుగు : ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 ఎగ్జామ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది హాజరయ్యారు. మన రాష్ట్రంలో 14 సెంటర్లలో, సుమారు 12 వేల మంది రాసినట్టు సమాచారం. మ్యాథ్స్ పేపర్​ కఠినంగా వచ్చిందని స్టూడెంట్లు తెలిపారు.

ఫిజిక్స్ పేపర్​ నార్మల్​గా రాగా, కెమిస్ట్రీలోని క్వశ్చన్లు ఈజీగా వచ్చాయని చెప్పారు. నిరుడితో పోలిస్తే ఈసారి పేపర్​ కొంత కఠినంగా ఉందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న వెబ్ సైట్​లో  స్టూడెంట్ల ఆన్సర్ షీట్లు అప్​లోడ్​ చేస్తారు. 11న ఫైనల్ కీతో పాటు రిజల్ట్స్​ వెల్లడిస్తారు.