జోతిష్యుడి సలహా.. జైల్లో పడేసింది

జోతిష్యుడి సలహా.. జైల్లో పడేసింది
  • శరవణ భవన్ ఓనర్​ రాజ్ గోపాల్ నసీబ్ ఇలా మారిం ది
  • మూడో పెళ్లి చేసుకోవాలని జోతిష్యుడి సలహా
  • తన దగ్గర పనిచేసే ఉద్యోగి కూతురిపై మనసుపడ్డ ‘దోశ కింగ్’
  • పెళ్లి చేసుకోవాలంటూఆమెకు బె దిరిం పులు
  • చివరికి అతని ఆదేశాలతో ఆమె భర్త హత్య
  • జీవిత ఖైదు విధించిన కోర్టు..

చెన్నై: పేదరికం నుంచి వచ్చి కోటిశ్వరుడయ్యాడు. బయట ఫుడ్​ తినడం తెలియని టైమ్​లో రెస్టారెంట్​ స్టార్ట్​ చేసి సక్సెస్​ కొట్టాడు. విదేశాలకూ రెస్టారెంట్​ చైన్ విస్తరించాడు. చివరికి ఓ జోతిష్యుడి మాట విని మూడో పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యాడు. అందుకోసం ఓ హత్యకు పాల్పడి చివరికి యావజ్జీవ శిక్షకు గురయ్యాడు. ఇదంతా ‘దోశకింగ్’​గా పేరుగాంచిన శరవణ భవన్​ రెస్టారెంట్​ చైన్​ వ్యవస్థాపకుడు పి.రాజగోపాల్​ లైఫ్​ స్టోరీ. ఆదివారం నుంచి రాజగోపాల్​ జీవత ఖైదు మొదలుకానుంది.

కిరాణా షాపు నుంచి..

వైట్​ అండ్​ వైట్​ డ్రెస్..​ నుదుటన గంధం బొట్టుతో కనిపించే రాజగోపాల్​ వయసు 71 ఏళ్లు. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఓ గ్రామంలో రాజగోపాల్ పుట్టాడు. ఆయన​ తండ్రి ఓ ఉల్లి వ్యాపారి. 1981లో రాజగోపాల్​ చెన్నైలో కిరాణా షాపు పెట్టాడు. అది సక్సెస్​ కావడంతో తెగించి తొలి రెస్టారెంట్​ను ప్రారంభించాడు. అప్పటి వరకూ బయట ఆహారం తినడం అంటే జనం అంతగా ఇష్టపడని టైమ్​లో ఈ రెస్టారెంట్​ పెట్టాడు. తక్కువ ధరకే ఇంటి ఫుడ్​ తిన్న ఫీలింగ్​ కలిగేలా వెరైటీ దోశలు, వడలు, ఇడ్లీలతో జనాలను అట్రాక్ట్​ చేసి రెస్టారెంట్​ను సక్సెస్​ చేశాడు. ఈ కాన్సెప్ట్​ ఇండియాతో పాటు విదేశాలకూ పాకింది. ఇంటి ఆహారానికి మొహం వాచి ఉండే అమెరికా, గల్ఫ్, యూరోప్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో 80 వరకు శరవణ భవన్​ ఔట్​లెట్లు పెట్టారు. స్టాఫ్​ను కూడా చాలా బాగా చూసుకునే రాజగోపాల్ ను ఉద్యోగులు పెద్దన్న(అన్నాచ్చి) అని పిలుచుకుంటారు.

ఫేట్​ మార్చిన అడ్వయిజ్

శరవణ భవన్​ రెస్టారెంట్లలో దేవుడి పటాల పక్కనే రెండు రాజగోపాల్​ ఫొటోలుంటాయి. ఒకటి ప్రస్తుతం వ్యాపారాలన్నీ నడుపుతున్న ఆయన కొడుకులతో ఉన్నదయితే. మరొకటి రాజగోపాల్​కు నమ్మకమైన గురువుతో ఉన్నది. రాజగోపాల్​ నమ్మకాలే.. ఆయన పతనానికి కారణమయ్యాయి. 2000 లో రాజగోపాల్​కు జీవితాన్నే మార్చేసే ఓ సలహా ఇచ్చాడు ఓ జోతిష్యుడు. అది నమ్మి తన దగ్గరే పని చేసే ఓ ఉద్యోగి కూతురిని మూడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజగోపాల్. అప్పటికే పెళ్లయిన ఆమె రాజగోపాల్​ ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. నో చెప్పినా వదలని రాజగోపాల్..​ కొన్ని నెలల పాటు ఆమెను, ఆమె భర్తను, కుటుంబాన్ని వేధించాడు. చివరికి 2001లో రాజగోపాల్ ఆదేశాలతో అతని అనుచరులు ఆమె భర్తను హత్య చేశారు. 2004లో రాజగోపాల్​ దోషిగా తేలడంతో పదేళ్ల జైలు శిక్ష పడింది. దీనిపై అప్పీలు చేయడంతో యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మార్చిలో సుప్రీంకోర్టు  ఈ శిక్షకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల 7న రాజగోపాల్​ సరెండర్​ కావాల్సి ఉంది. మిగతా జీవితమంతా అతను జైల్లో గడపాల్సిందే.