ఇంకో నాలుగు రోజులైతే సూర్యుడు కొత్త రికార్డ్

ఇంకో నాలుగు రోజులైతే సూర్యుడు కొత్త రికార్డ్
  • యాక్టివ్ గా లేడుమరో
  • 4 దినాలైతే ఇది కొత్త రికార్డే
  • లాస్ట్ స్టేజీలో 24వ సోలార్ సైకిల్

ఎప్పుడూ భగభగ మండుతూ, నిప్పులు కక్కే సూర్యుడు జరంత సల్లవడిండు. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి అంటే.. 264 దినాలుగా పెద్దగానిప్పులు కక్కుతలేడు. ఇట్లనే మరో 4 దినాలు దాటితేఇది కొత్త రికార్డే అయితదని నాసా సైం టిస్టులు చెప్తున్నరు. ఇంతకూ సూర్యు డు సల్లవడటమేందీ? అంటే..సూర్యుడిలో ప్రతి11 ఏండ్లకు ఒకసారి సోలార్ సైకిల్ పూర్తయితదని సైంటిస్టుల అంచనా. ఈ సైకిల్ ప్రారంభంలో సోలార్ మ్యాగ్జిమం, ముగిం పులో సోలార్ మినిమం అనే రెండు దశలు కొనసాగుతాయి. ప్రస్తుతం24వ సోలార్ సైకిల్ నడుస్తోందని, ఇందులోనూసూర్యుడు సోలార్ మినిమం చివరి స్టేజ్ లో ఉన్నాడని అంటున్నారు.

2023 నుంచి 25వ సోలార్ సైకిల్మొదలై, 2025 కల్లా సూర్యు డు మళ్లీ భీకరంగా మారిపోతాడని చెప్తున్నా రు. 2008లో సోలార్ మినిమంస్టేజ్ 268 రోజులు కొనసాగిం దని, ఇప్పటివరకూఅదే సు దీర్ఘ సోలార్ మినిమం స్టేజ్ అని సైంటిస్టులు పేర్కొంటారు. సూర్యుడు బాగా యాక్టివ్ గా ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రం చాలా బలంగా ఉంటుంది. ఉపరితలంపై నల్లటి మచ్చల్లా సన్ స్పాట్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి ఇవి గురు గ్రహంఅంత సైజు కూడా ఉంటుం టాయి. అలాగే భారీఎత్తు న సోలార్ ఫ్లేర్స్ (జ్వాలలు) అంతరిక్షంలోకి ఎగిసిపడుతుంటాయి. అయితే, సోలార్ మినిమం స్టేజ్ లో సూర్యుడి అయస్కాంత క్షేత్రం చాలా వీక్ అవుతుంది.అందువల్ల ఉపరితలంపై సన్ స్పా ట్స్ చాలా వరకూతగ్గిపోతాయి. దీంతో సూర్యుడు ప్రశాంతంగా కన్పిస్తడు. భూమిని తాకే వేడి కూడా తగ్గుతది.