ఆరు కోట్ల ఏళ్ల తర్వాత పువ్వులు

ఆరు కోట్ల ఏళ్ల తర్వాత పువ్వులు

వేడికి మొక్కలు ఎండిపోవడం సహజం. కానీ, అదే వేడికి బ్రిటన్​లో ఈ రెండు మొక్కలకు పూలు పూశాయి. జపాన్​కు చెందిన సైకాడ్​ అనే జాతికి చెందినవి ఈ మొక్కలు. 28 కోట్ల ఏళ్ల కిందట ఈ మొక్కలకు పూలు పూయడం ఆగిపోయింది. అప్పుడు ఆడ, మగ మొక్కలు ఒకేసారి పూసేవి. మళ్లీ ఇప్పుడు ఆ రెండు మొక్కలకు 6 కోట్ల ఏళ్ల తర్వాత పూలు పూశాయి. దీనికి కారణం బ్రిటన్​లో గత ఏడాది  తీవ్రమైన ఎండ వేడేనని వెంటినార్‌‌‌‌ బొటానిక్ గార్డెన్‌‌ క్యూరేటర్‌‌‌‌ తెలిపారు. ఈ ఆడ, మగ మొక్కలకు ఒకే సారి పూలు పూయడం చాలా అరుదని,  ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే అలా జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు. సైకన్‌‌ రివోల్యుటా జపాన్‌‌ నేటివ్ అని, కానీ బ్రిటన్‌‌లోని బొటానిక్ గార్డెన్‌‌, గ్రీన్‌‌ హౌస్‌‌ షెడ్లలో వీటి పెరుగుదలకు అనుకూలమైన వాతావారణం ఉందని వారు తెలిపారు.