మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు

మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మసాలా బ్రాండ్లు అయిన ఎవరెస్ట్ , MDH లపై  బ్రిటన్ నిషేధం విధించింది. ఈ రెండు బ్రాండ్లు హానికరమైన కెమికల్స్ అధిక మోతాదులో ఉందని వీటిని నిషేధించింది. భారత్ నుంచి వచ్చే అన్ని సుగంధ ద్రవ్యాల దిగుమతులపై నియంత్రణ చర్యలు పెంచిన్లు బ్రిటర్ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. 

ఇంతకు ముందు కూడా MDH, ఎవరెస్ట్ ఉత్పత్తులపై హాంకాంగ్  నిషేధం విధించింది. ఈ రెండు కంపెనీల ద్వారా వచ్చిన మూడు మసాలా మిశ్రమాల అమ్మకాలను నిలిపివేసింది. ఇందులో క్యాన్సర్ కారర పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉందని అమ్మకాలపై నిషేధం విధించింది. సింగపూర్ కూడా  ఎవరెస్ట్ మిక్స్ ను రీకాల్ చేయాలని ఆదేశించింది. వీటితో పాటు న్యూజిలాండ్, యూఎస్, ఇండియా , ఆస్ట్రేలియా ఆ రెండు బ్రాండ్ లకు సంబంధించిన సమస్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. 

అయితే MDH , ఎవరెస్ట్ కంపెనీుల మాత్రం నిషేధించడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండు బ్రాండ్లు తమ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చెప్పాయి. 

అన్ని భారతీయ మసాలా దినుసులపై ప్రభావం చూపుతున్న అత్యంత కఠినమైన అణిచివేతలో, UK యొక్క ఆహార ప్రమాణాల ఏజెన్సీ (FSA) ఆందోళనల దృష్ట్యా "ఇథిలీన్ ఆక్సైడ్‌తో సహా భారతదేశం నుండి వచ్చే సుగంధ ద్రవ్యాలలో పురుగుమందుల అవశేషాల కోసం అదనపు నియంత్రణ చర్యలను వర్తింపజేసిందని" తెలిపింది. ఏజెన్సీ తీసుకుంటున్న కచ్చితమైన చర్యలను వివరించలేదు.

భారతదేశం సుగంధ ద్రవ్యాల ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. ఉత్పత్తిదారు, వినియోగదారు కూడా. 2022లో బ్రిటన్ 128 మిలియన్ డాలర్ల విలువైన మసాలా దినుసులను దిగుమతి చేసుకుంది. అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ వెబ్‌సైట్ నుండి డేటా  ప్రకారం.. భారత్ దేశం నుంచి 23 మిలియన్ డాలర్ల సుగంధ ద్రవ్యాల ఎగుమతి జరిగింది. MDH , ఎవరెస్ట్ తమ ఉత్పత్తులను US, యూరప్, సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్ , ఆస్ట్రేలియాతో సహా అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తాయి.

ఈ క్రమంలో భారత్ కు చెందిన MDH, ఎవరెస్ట్ మసాలాలు నిషేధం చర్చనీయాంశంగా మారింది.