ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లు ప్లేస్, అక్కడ రవాణా మార్గాలు, ప్రొటెక్షన్ అన్నీ చూసుకుంటారు. ఇల్లు ఎలా కట్టుకోవాలో ఎన్నెన్నో ఊహించుకుంటారు. ఇలా కట్టాలి.. లోపల అలా ఉండాలంటూ ఎన్నో అభిరుచులుంటాయి. కానీ, అవేవీ లేకుండా చుట్టూ సముద్రం. ఒడ్డున కొండ. ఆ కొండంచుకు వేలాడే ఇల్లు. ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాకు చెందిన మోడ్స్కేప్ కాన్సెప్ట్ అనే సంస్థ ఈ ఇంటిని కట్టింది. నౌకలకు వేలాడే బార్నాకిల్స్ స్ఫూర్తిగా ఈ ఇంటికి డిజైన్ చేసినట్టు సంస్థ చెప్పింది. ఇంటికి తగ్గట్టే క్లిఫ్ హౌస్ అని దానికి పేరు పెట్టారు. ప్రస్తుతానికైతే ఇది జస్ట్ కాన్సెప్ట్ డిజైన్ మాత్రమే. ఆస్ట్రేలియా జనం ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఇష్టపడుతుండడంతో కంపెనీ ఈ డిజైన్‌కు ప్లాన్ చేసిందన్నమాట. వర్టికల్ (నిలువు) ఫ్లోర్ ప్లాన్‌తో దీనిని కట్టారు. ప్రతి ఫ్లోర్‌కూ వెళ్లేలా లిఫ్టు, మెట్లు ఉంటాయి. చుట్టూ సముద్ర అందాలు కనిపించేలా బిల్డింగ్ చుట్టూ అద్దాలను అమర్చుతారు.
