కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు.. వీడియో

కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు..  వీడియో

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షం పడింది. ఈ క్రమంలో గుడుపల్లె మండలంలోని కోటచెంబగిరి గ్రామ సమీపంలో పిడుగు పడింది. ఓ వైపు చిరుజల్లులు పడుతూనే పెద్ద మెరుపుతో కూడిన శబ్దం రావడంతో గ్రామ ప్ర‌జ‌లు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్రామం పక్కనే ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు ప‌డింది. పిడుగుపాటుకు కొబ్బ‌రి చెట్టు పూర్తిగా కాలిపోయింది. పిడుగు పడిందన్న విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు ఈ వైప‌రీత్యంతో ఎవ‌రికీ ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఊపిరిపీల్చుకున్నారు.