రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని .. రక్షించేందుకే ఈ ఎన్నికలు : మల్లికార్జున ఖర్గే

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ..  రక్షించేందుకే  ఈ ఎన్నికలు :  మల్లికార్జున ఖర్గే

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎన్నికలు మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మోదీ సర్కార్ అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా రాజ్యాంగం రూపొందిందని చెప్పారు. బిహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. కాంగ్రెస్ దేశాన్ని విభజించే కుట్ర చేస్తుందని.. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. మోదీ అధికారంలోకి వస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని మారుస్తారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారని, రిజర్వేషన్లను అంతం చేస్తారన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణ త్యాగం చేశారన్నారు ఖర్గే. 

గత కాంగ్రెస్ సర్కార్ స్కీంలను ప్రధాని మోదీ కాపీ కొడుతున్నారన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను.. 2013లో మన్మోహన్ ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేశారు. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ.. ఉచిత రేషన్ ను వ్యతిరేకించారని చెప్పారు. అదే స్కీంను గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ సర్కార్ జనాభా లెక్కలు చేపట్టకపోవడంతో.. ఎంతోమంది అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు జైరాం రమేష్.