మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టింది : భట్టి విక్రమార్క

మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టింది : భట్టి విక్రమార్క

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశ సంపదను పేదలకు పంచాలని కృషి చేస్తుందని  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గద్వాల జిల్లా అయిజ పట్టణంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పదేండ్లు  బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిందన్నారు.  రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం  పేరుతో లక్ష కోట్లు దండుకున్నారని ఆరోపించారు. 

దేశ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టిందన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, అది మునిగిపోయే నావ లాంటిదన్నారు. ఆ పార్టీలో ఉండలేక చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం లేదని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నాడని చెప్పారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పంచన చేరి అలంపూర్ పరువు తీశాడని మండిపడ్డారు. ఇటీవల అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పదివేల కోట్లు విడుదల చేశామని చెప్పారు.  తాము ప్రజల కోసం అధికారంలోకి వచ్చామన్నారు. ఐదు గ్యారంటీలు అమలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం  చేస్తుందన్నారు భట్టి.