
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న సినిమా 'ఓజి'.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్న క్రమంలో ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా గ్లిమ్ప్స్ రిలీజయ్యి సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది.
ఈ క్రమంలో ఓజి సినిమా గురించి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఫిలిమ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని రూ. 65కోట్లతో సొంతం చేసుకుందట. 200కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిలిమ్. ఎలక్షన్స్ తర్వాత జూన్ లో పవన్ ఈ సినిమా కోసం మూడు వారాలు డేట్స్ కేటాయించనున్నారని సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాతో పాటు పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ పూర్తి కావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.