ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కు టోక్యో ఆతిథ్యం

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కు టోక్యో ఆతిథ్యం

2025 సంవత్సరంలో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ కు జపాన్ రాజధాని టోక్యో వేదికగా నిలువనుంది. ఈవిషయాన్ని వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు నైరోబీ (కెన్యా), సిలేసియా (పోలండ్), సింగపూర్, టోక్యో బిడ్లను దాఖలు చేయగా.. నిర్వహణ సామర్థ్య విశ్లేషణలో ఎక్కువ స్కోరింగ్ సాధించిన టోక్యోకే అవకాశం దక్కింది. కొవిడ్ కారణంగా 2020లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతించలేదు. 2025లో అవే ఒలింపిక్ స్టేడియంలలో  ప్రేక్షకుల నడుమ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. 2024లో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ కు క్రొయేషియాలోని మెడ్యులిన్, ప్యులా ఆతిథ్యం ఇస్తాయని వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. 2026లో వరల్డ్ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్స్ ను నిర్వహించేందుకు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న టాలాహస్సీ నగరాన్ని ఎంపిక చేశారు.