ఓటీటీలపై స్టడీ వచ్చే నెల పూర్తి

ఓటీటీలపై స్టడీ వచ్చే నెల పూర్తి

వాట్సప్‌, స్కైప్‌ వంటి ఓటీటీ (ఓవర్‌‌ ది టాప్‌ ) సర్వీసులను తన పరిధిలోకి తీసుకురావడానికి నిర్వహిస్తున్నఅభిప్రాయసేకరణ, స్టడీ కార్యక్రమాలు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయని టెలికం రెగ్యులేటరీ అథారిటీఆఫ్ ఇండియా (ట్రాయ్‌) తెలిపింది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులపై, యూరప్‌ మోడల్‌ పై ట్రాయ్‌ ఇది వరకే స్టడీ చేసింది. దీనిపై ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌‌ఎస్‌ శర్మ మాట్లాడుతూ ఓటీటీ విధానాన్ని రూపొందించడానికి యూరోపియన్‌ ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్ కోడ్‌ ను స్టడీ చేశామని చెప్పారు.

ఓటీటీలను కంట్రోల్‌ చేయడానికి అత్యుత్తమ విధానాలను తీసుకొస్తామని చెప్పారు. ఇంటర్నెట్‌ సాయంతో పనిచేచేసే వాట్సప్‌, స్కైప్‌, వైబర్‌‌ వంటిమొబైల్‌ అప్లికేషన్లను ఓటీటీ సర్వీసులుగా పిలుస్తారు. యూరోపియన్‌ ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌ కోడ్‌..మొబైల్‌, ఫిక్స్‌ డ్‌ లైన్‌ ఆపరేటర్లకు ఓటీటీ యాప్స్‌ ను కంట్రోల్‌ చేయడానికి కొన్ని నిబంధనలు విధించింది. ఓటీటీలపై బహిరంగ చర్చల కోసం ట్రాయ్‌ బెంగళూరులో బుధవారం సమావేశం జరుపుతోంది. ఢిల్లీలోనూ త్వరలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయనుంది.

మే ఆఖరు కల్లా ఓటీటీపై ఒక విధానాన్నిలేదా సిఫార్సులను తయారు చేయగలమని శర్మఅన్నారు. ఓటీటీలను ట్రాయ్‌ పరిధిలోకి తీసుకురావాలా ? వద్దా ? అనే విషయమై చర్చలకు గత ఏడాది కన్సల్టేషన్‌ పేపర్‌‌ను జారీ చేసింది. ఇటీవల ఓటీటీయాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీక్షణంగా గమనిస్తోంది. ఇవి మరింత జవాబు దారీగా ఉండేలా ఐటీ చట్టం లోమార్పులు తేవాలని కోరుకుంటున్నది. ఓటీటీలకు కూడా లైసెన్సింగ్‌ విధానాన్ని అమలు చేయాలని, ట్రాయ్‌ పరిధిలోకి తీసుకురావాలని టెల్కోలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ట్రాయ్‌ వంటి సంస్థల పరిధిలోకి వస్తే సృజనాత్మకకు హాని కలుగుతుందని ఓటీటీలు వాదిస్తున్నాయి.

వోఓడీ చానెల్‌ కోసం ఎయిర్‌‌టెల్‌, జీ ఒప్పందం
స్పాట్‌ లైట్‌ పేరుతో నిర్వహించబోయే వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీఓడీ) చానెల్‌ ఏర్పాటు కు ఎయిర్‌‌టెల్‌, జీ గ్రూపు చేతులు కలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రంగస్థల సంస్థ నాటకాలను ఇందులో చూడొచ్చు. భారతీ ఎయిర్‌‌టెల్ డీటీహెచ్‌ విభాగం ఎయిర్‌‌టెల్‌ టీవీ, జీ ఎంటర్‌‌టైన్‌ మెంట్‌ కు చెందిన జీ థియేటర్‌‌ ఈ వీఓడీని నిర్వహిస్తాయి. నాటకరంగానికి మార్కెట్‌ ను కల్పించడానికే ఈ ప్రయత్నమని రెండు కంపెనీలూ తెలిపాయి. వీఓడీ యూజర్లు హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లిష్‌‌ భాషలకు చెందిన 100 నాటకాలనుచూడొచ్చు.