ఆర్టీసీ విలీనం తప్ప… కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలి: కేకే

ఆర్టీసీ విలీనం తప్ప… కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలి: కేకే

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయన్నారు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. పరిస్థితులు చేయిదాటకముందే… ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులతో సమ్మె విరమింపచేసి… ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలన్నారు. ఆర్టీసీ విలీనం తప్ప… కార్మికుల ఇతర డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా తానే ఉన్నానని… ఆర్టీసీ విలీనం గురించి మేనిఫెస్టోలో పెట్టనేలేదన్నారు. ఆర్టీసీ మాత్రమే కాకుండా ఏ ప్రభుత్వరంగ సంస్థను కూడా విలీనం చేయాలని మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు. ప్రభుత్వ విధానాలను మార్చుకోమనడం యూనియన్లకు సంబంధంలేని అంశమన్నారు కేకే.