మందు పార్టీలకు సై.. రాజకీయ పార్టీలకు నై

మందు పార్టీలకు సై.. రాజకీయ పార్టీలకు నై

ఒమిక్రాన్  ఎఫెక్ట్ తో  వేడుకలపై సర్కార్  ఇచ్చిన ఆదేశాల్ని ఒక్కో రకంగా  ఇంప్లీమెంట్  చేస్తున్నారు అధికారులు.  పోలీసులు ఓ రకంగా...హెల్త్  ఆఫీసర్స్  ఇంకో రకంగా అన్వయిస్తున్నారు.  మందు పార్టీలకు ఆరోగ్యశాఖ  అధికారులు  ఊ అంటుంటే..రాజకీయ పార్టీలకు  సర్కార్  ఊఊ అంటోంది. మాస్కులు, డబుల్  వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు పార్టీలు  చేసుకోవచ్చని, ఎంజాయ్ చేయొచ్చని  డీహెచ్  శ్రీనివాసరావు చెప్తుంటే... పొలిటికల్ పార్టీల సభలకు, ర్యాలీలకు  అనుమతి లేదని  పోలీస్ బాస్  వార్నింగ్ ఇచ్చారు.

ఇదే కారణంతో  సోమవారం బీజేపీ నిరుద్యోగ  దీక్షను  అడ్డుకుంది సర్కార్. అదే రోజు  రేవంత్ రెడ్డి  రచ్చబండను  కూడా అడ్డుకున్నారు పోలీసులు.  అవే రూల్స్ తో  ఇవాళ కూడా  రేవంత్ రెడ్డిని  హౌస్ అరెస్ట్ చేసింది  సర్కార్. రూల్స్ పాటిస్తూ కార్యక్రమాలు  చేసుకోవాలని హైకోర్టు కూడా  సూచించింది. వేడుకలపై సర్కార్  ఇచ్చిన ఆదేశాలను..తనకు నచ్చినట్టుగా  వాడుకుంటోందన్న విమర్శలొస్తున్నాయి.  అధికార పార్టీకి ఇంప్లీమెంట్  కాని  గైడ్ లైన్స్...విపక్షాలపై రుద్దుతున్నారని మండిపడుతున్నారు.  ఆదాయం కోసం  క్లబ్బులు, పబ్బులు,  బార్ అండ్  రెస్టారెంట్లు, వైన్స్ లకు  గడువు పెంచింది  సర్కార్. రాజకీయంగా ఇబ్బందులొస్తాయని విపక్ష పార్టీల  దీక్షలు, ర్యాలీలకు బ్రేకులు  వేస్తోందన్న విమర్శలొస్తున్నాయి.