వన్ మ్యాన్ షో వద్దు.. సీనియర్లను పట్టించుకోరా.?

వన్ మ్యాన్ షో వద్దు.. సీనియర్లను పట్టించుకోరా.?

కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత మొదటిసారి గాంధీ భవన్ కు వచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... మాణిక్కం ఠాగూర్ ముందే అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని.. కాంగ్రెస్ పార్టీ లాగా నడిపించాలని ఠాకూర్ కు చెప్పారు ఉత్తమ్. ఒక్కరి మైలేజ్ కోసం కాకుండా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో కొత్త కార్యవర్గం విఫలమైందన్నారు ఉత్తమ్. దీంతో ఇక నుంచి అలా కాకుండా చూస్తానని ఉత్తమ్ కు చెప్పారు ఠాగూర్. దీంతో పార్టీ లైన్ లోనే నాయకులు పనిచేయాలని రేవంత్ కు దిశానిర్దేశం చేశారు మాణిక్కం ఠాగూర్ . వన్ మ్యాన్ షో కాకుండా.. సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సీనియర్ల అనుభవాలను కూడా పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలన్నారు ఠాగూర్. ఈ సమావేశానికి  కోమటిరెడ్డి బ్రదర్స్, జీవన్ రెడ్డి, జానారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కాలేదు.