గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష

గాంధీభవన్లో  కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష

కాంగ్రెస్ ర్యాలీకి అనుమతించకపోవడంతో గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్షకు దిగారు ఆ పార్టీ నేతలు . దేశాన్ని రక్షించండి- రాజ్యాంగాన్ని రక్షించండి” పేరుతో చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాసేపు కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో గాంధీ భవన్లోనే 24 గంటల సత్యాగ్రహ దీక్షకు దిగారు.  ఈ దీక్షలో ఉత్తమ్  కుంతియా, బోసురాజు జానారెడ్డి, షబ్బీర్ అలీ,పొన్నం ప్రభాకర్, భట్టి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు నష్టపోయారన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. గాంధీభవన్ లో  కాంగ్రెస్ పార్టీ 135 ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ  జెండా ఆవిష్కరించిన ఉత్తమ్..  మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలచుకుంటామన్నారు. ఆర్ఎస్ఎస్  సభలకు అనుమతిచ్చిన కేసీఆర్ .. సెక్యూలర్ కాంగ్రెస్ ర్యాలీకి అనుమతించలేదన్నారు.  బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మద్య చిచ్చు పెడుతుందన్నారు.  స్వాతంత్ర్యంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అన్నారు షబ్బీర్ అలీ. అప్పట్లో బీజేపీ, సంఘ్ పరివార్ ఎవరు పాల్గొనలేదన్నారు. ఎన్ పి ఆర్ లిస్టులో ఉన్న ప్రశ్నలు అభ్యంతకరమన్నారు.  అస్సాంలో ఇలాగే చేసి అభాసు పాలయ్యారన్నారు .

పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై చర్చకు రాకుండా ఆర్టికల్ 370, ట్రిపుల్ తాలాక్, సీఏఏ, ఎన్ఆర్సి పేరుతో బీజేపీ పక్కదారి పట్టిస్తుందన్నారు పొన్నం ప్రభాకర్. మోడీ ప్రభుత్వం హయంలో టూరిజం తగ్గిందన్నారు. జీడీపీ పడిపోయి దేశ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు. దేశంలో మోడీని రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దె దించేయాలనే నినాదంతో ముందుకెళ్లాలన్నారు.