RTC సమ్మె విషయంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు

RTC సమ్మె విషయంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు

ఢిల్లీ:  కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ  వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితుల గురించి వివేక్ మంత్రికి వివరించారు. ముఖ్యంగా  ఆర్టీసీ కార్మికుల సమ్మె,  సమ్మె విరమణ తర్వాత యాజమాన్యం వారిని విధుల్లోకి అనుమతించకపోవడం.. వంటి అంశాలను మంత్రితో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని పిర్యాదు చేశారు. కార్మికుల సమస్యను త్వరగా పరిష్కరించాలని  వివేక్ కోరడంతో.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ని కోరారు వివేక్ వెంకట స్వామి, మంచిర్యాల బీజేపీ అసెంబ్లీ ఇంచార్జ్ రగునాథ్. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి హర్ష వర్ధన్… డీపీఆర్ రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకుంటానని అన్నారు.

Vivek Venkata Swamy complained to Union Minister on RTC strike issue