సీఎం మాటలు బాధించాయి : VROలు

సీఎం మాటలు బాధించాయి : VROలు

సెక్రటేరియట్ : సీఎస్ శైలేంద్రకుమార్ జోషీని కలిశారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ VRO  అసోసియేషన్ నాయకులు. గ్రౌండ్ లెవెల్లో ఎదురవుతున్న సమస్యలపై సీఎస్ తో చర్చించినట్టు వివరించారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన వీఆర్వోలు… CM కేసీఆర్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. రెవెన్యూ సిస్టమ్ లో ఎవరో ఒకరు అవినీతికి పాల్పడినంత మాత్రాన.. అందరూ అలాంటి అవినీతి VROలు ఉండరని అన్నారు.

రెవెన్యూ యంత్రాంగం కొంత ఆందోళనకు గురవుతోందని చెప్పారు. 92% భూముల సమస్యలను పరిష్కరించామని.. 8% మాత్రమే సమస్యతో ఉన్న భూములున్నాయని వివరించారు. తల్లి లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ను రద్దు చేస్తారని తాము అనుకోవడం లేదని అన్నారు. సంస్కరణలు చేస్తే మంచిదే నని చెప్పిన వీఆర్వోలు.. ధరణి వెబ్ లో ఉన్న సాంకేతిక సమస్యల వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పారు. ధరణి వెబ్సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను జాయింట్ కలెక్టర్ ఇచ్చారనీ.. MRO కు ఇవ్వాలని తాము సీఎస్ ను కోరినట్టుగా వివరించారు.