కొత్తిమీర, పుదీనా నెలల పాటు తాజాగా ఉంచొచ్చిలా

కొత్తిమీర, పుదీనా నెలల పాటు తాజాగా ఉంచొచ్చిలా

వంట​కు మంచి రుచి, సువాసనను ఇస్తుంటాయని చాలామంది కొత్తిమీర, పుదీనా వాడుతుంటారు. కానీ, అవి తెచ్చిన కొన్ని రోజులకే తాజాదనం కోల్పోతాయి. వాడిపోతాయి. లేదా పాడైపోతాయి. అయితే వీటిని రోజులు కాదు నెలల పాటు తాజాగా ఉంచొచ్చు. అదెలాగంటే...

  •     కొత్తిమీర, పుదీనా ఆకుల కాండం నుంచి కుళ్ళిన కాడలు, ఆకుల్ని తీసేయాలి. వాటిని ఉప్పు, పసుపు కలిపిన నీళ్లలో అరగంట నానబెట్టాలి. తరువాత శుభ్రంగా కడిగి, వడకట్టాలి. 
  •     ఒక్కో ఆకును కాడ నుంచి తుంచాలి. తరువాత గిన్నెలో నీళ్లు తీసుకొని, స్టవ్‌‌ సిమ్‌‌లో పెట్టి నీళ్లు మరగనీయాలి. ఆ నీటి ఆవిరిపైన తరిగిన ఆకులను ఉంచి రెండు నిమిషాలు ఉడికించాలి.
  •     ఆకుల్ని ఉడికించాక చల్లారబెట్టాలి. తరువాత జిప్ లాక్ బ్యాగ్ లేదా గాలి చొరబడని డబ్బాలో పెట్టి, ఫ్రిజ్‌‌లో స్టోర్‌‌‌‌ చేసుకోవాలి.
  •     ఆకులను వంటకు వాడాలి అనుకున్నప్పుడు ఒక చెంచాతో కదిలించాలి. దానివల్ల ఆకులు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి.
  •     అలాగే ఇంకో పద్దతి కూడా ఉంది.. ఉడికించిన ఆకులను మెత్తగా పేస్ట్‌‌ చేయాలి. వాటిని ఐస్ క్యూబ్‌‌ కంటైనర్‌‌‌‌లో పోసి ఫ్రీజర్‌‌లో పెట్టాలి. ఈ క్యూబ్స్‌‌ను కూడా కూరల్లో వాడొచ్చు.