ప్రజలు చనిపోతే ఎవరిది బాధ్యత?: ఉద్ధవ్ థాక్రే

ప్రజలు చనిపోతే ఎవరిది బాధ్యత?: ఉద్ధవ్ థాక్రే

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేయడానికి తొందర పడటం సరికాదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చెప్పారు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే మరణాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. శివసేన మౌత్‌పీస్‌ అయిన సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే పలు విషయాలపై మాట్లాడారు.

‘కొందరు తెలివైన వారు లాక్‌డౌన్ గురించి మాట్లాడుతున్నారు. మంచిది, మీ కోసం మేం అన్నింటినీ తెరుస్తాం. ఒకవేళ దీని వల్ల ప్రజలు చనిపోతే ఆ బాధ్యతను మీరు తీసుకుంటారా? తిరిగి ఓపెన్ చేయడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ వాళ్లు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేను లాక్‌డౌన్ అనే మాటే వాడటం లేదు. ఏదేమైనా నేను లాక్‌డౌన్‌ను ఎత్తేయబోను. కానీ మెళ్లిమెళ్లిగా ఆంక్షలను మాత్రం తొలగిస్తాం. ఈ యత్నం సఫలమైతే తిరిగి షట్‌డౌన్ చేయాల్సిన అవసరమే ఉండదు. హెల్త్‌తోపాటు ఎకానమీ గురించి కూడా ఆలోచించాలి. కరోనాతో సహజీవనం అంత సులభం కాదు’ అని థాక్రే పేర్కొన్నారు.