జేఈఈ, నీట్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌పై కేసీఆర్‌‌‌‌ మౌనమెందుకు?

జేఈఈ, నీట్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌పై కేసీఆర్‌‌‌‌ మౌనమెందుకు?

హైదరాబాద్, వెలుగు: లక్షల మంది స్టూడెంట్ల జీవితాలతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జేఈఈ, నీట్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడం బాధ్యతారాహిత్యమన్నారు. నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జేఈఈ వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు . దీంతో శుక్రవారం గాంధీ భవన్ దగ్గర మోహరించిన పోలీసులు.. కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ లోనే నేతలు దీక్ష చేపట్టారు.

కేసీఆర్ మౌనంగా ఒప్పుకొని..

తరువాత ఉత్తమ్ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రంలో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంద న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జేఈఈ, నీట్ పరీక్షలు ని ర్వహించి దాదాపు 25 లక్షల మంది స్టూడెంట్లు, వారి కుటుంబాల ప్రాణాలను పణంగా పెట్టాలని కేంద్రం భావిస్తుందా అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మౌనంగా అంగీకరించడం ద్వారా, సీఎం కేసీఆర్ జేఈఈ, నీట్ కోసం నమోదు చేసుకున్న దాదాపు 1.20 లక్షల మంది స్టూడెంట్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని అన్నారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. స్టూడెంట్ల జీవితాలకన్నాముఖ్యమైంది ఏమీ లేదన్నారు. జేఈఈ, నీట్ కు హాజరయ్యే స్టూడెంట్లకు ఎవరికీ ఏమీ కాదని ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.

ఎట్ల పోతరు..? ఎట్ల వస్తరు..?

‘‘పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ందు బాటులో లేదు. స్టూడెంట్లు ఎగ్జామ్ సెంటర్లకు ఎట్లోస్తరు? తిరిగి ఎట్లపోతరు. చాలా ఇబ్బందులు పడుతరు’’ అని ఉత్తమ్ చెప్పారు. పరీక్షలను వాయిదా వేసే వరకు కాంగ్రెస్ ఆందోళ నలు కొనసాగిస్తుందని అన్నారు. ధర్నాలో పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు