సోమవారం నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు

సోమవారం నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు

సోమవారం నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు యథాతధంగా జరగనున్నాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్...మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో  సెషన్లో పరీక్షలు జరుగాయని తెలిపారు. మూడురోజుల పాటు రెండు షిప్టులలో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందులో కోసం తెలంగాణలో 89..ఏపీలో 19 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షల కోసం లక్షా 72 వేల 241 మంది విద్యార్థులు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఒక్కరోజు ముందే చూసుకోవాలని గోవర్థన్ సూచించారు.