కుండపోత వాన

కుండపోత వాన
  • హైదరాబాద్ లో రహదారులు జలమయం

  •  పలు చోట్ల ట్రాఫిక్ జామ్

  •  సంగారెడ్డిలో కూలిన చెట్లు

  •  మిగతా జిల్లాల్లోనూ వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మియాపూర్, హైదర్ నగర్, నిజాంపేట, బాచుపల్లి, అల్వాల్, శామీర్ పేట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఖైరతాబాద్ పంజాగుట్ట అమీర్ పేట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ సనత్ నగర్, బషీర్ బాగ్ , అబిడ్స్ , హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తోంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏకధాటిగా బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. 

హైదరాబాద్​ లో కురిసిన వర్షానికి జనజీవనం స్థంభించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ వర్షం కురుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, హిమాయత్ నగర్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి.