సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని అబద్దాలే చెప్పారని హరీశ్ విమర్శించారు. సీఎం బామ్మర్దిని కాపాడేందుకు ప్రయత్నించారని అన్నారు. భట్టి విక్రమార్క సైట్ విజిటింగ్ పై అబద్ధాలు చెప్పారు..తమకు కావాల్సిన వాళ్లకు టెండర్లు దక్కేలా చేశారని ఆరోపించారు హరీశ్. సింగరేణి తెలంగాణ ప్రజలందరి ఆస్తి అని..సింగరేణి స్కాంకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భట్టి తప్పించుకున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ఓబీ పనులకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాకే ఓబీ పనులకు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం అమల్లోకి తెచ్చారన్నారు. గతంలో ఓబీ పనులకు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదన్నారు హరీశ్. 2018 నుంచి 2020 వరకు దేనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పారు. 2025 తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకొచ్చారని తెలిపారు.
సైట్ విజిటింగ్ మొదటి లబ్ధిదారుడు సృజన్ రెడ్డి. ఓబీ వర్క్స్ లో మొదటి లబ్ధిదారుడు సీఎం బామ్మర్ది. ఏ టెండర్ వచ్చినా 10శాతం క్యాష్ డౌన్ చేయాలన్నారు.సైట్ విజిట్ సర్టిఫికెట్ తో వచ్చిన అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. సైట్ విజిటింగ్ తో టెండర్ల కేటాయింపుపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని మెయిల్స్ వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు హరీశ్.
