ఒకరు IAS, మరొకరు IPS.. హైదరాబాద్లో సింపుల్గా రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్న అధికారులు

ఒకరు IAS, మరొకరు IPS.. హైదరాబాద్లో సింపుల్గా రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్న అధికారులు

ఈ రోజుల్లో పెళ్లంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. వందల మంది చుట్టాలు, వేలు, లక్షల ఖర్చుతో కూడిన డెకరేషన్లు, డీజే, నలుగురు చెప్పులకునేలా భోజనాలు, ఊరేగింపులూ.. అబ్బో ఒక్కటేమిటీ.. లక్షల్లో లేదా కోట్లలో ఖర్చుకావాల్సిందే. చేతిలో పది లక్షలు ఉంటే ఇరవై లక్షలు ఖర్చు చేసీ మ్యారేజ్ చేసుకునే రోజులు ఇవి. కానీ ఈ అధికారులు మాత్రం నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. లక్షల్లో జీతం ఉండే  IAS, IPS అధికారులు.. తలచుకుంటే ఎంత గ్రాండ్ గా నైనా వివాహం చేసుకోవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సింపుల్ గా పెళ్లి చేసుకుని చాలా మందిని ఆలోచింపజేస్తున్నారు.

చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. పెద్ద హోదాలో ఉన్నప్పటికీ.. ఇంత సాధారణంగా పెళ్లి చేసుకోవడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. 

IPS శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన పెళ్లికి పలువురు ఉన్నతాధికారులు హాజరై ఆశీర్వదించారు. ఎలాంటి అడబరాలకు పోకుండా పెళ్లిచేసుకున్న దంపతులను పలువురు మెచ్చుకున్నారు.