పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్'. ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ హైప్రెక్రియేట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక పవర్ ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
లేటెస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుండగా, అది పూర్తయ్యిన వెంటనే ఒక గ్రాండ్ సాంగ్ ను షూట్ చేయాలని మేకర్స్ ప్లాస్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో ప్రభాస్ స్టెప్స్ తో పాటు దిమ్రి గ్లామర్ కూడా హైలైట్ గా ఉంటుందట . భారీ సెట్స్, గ్రాండ్ విజు వల్ తో ఈ పాటను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కథలోని ఎమోషన్, యాక్షన్ కు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్ తో పాటు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ లు సంయుక్తం గా నిర్మిస్తున్నాయి.
