ముగింపునకు దగ్గరలో ఇరాన్ యుద్ధం.. తిరిగి పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

ముగింపునకు దగ్గరలో ఇరాన్ యుద్ధం.. తిరిగి పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధం దాదాపుగా చివరి దశకు చేరిందని ట్రంప్ వెల్లడించారు. దీంతో స్థిమితపడ్డ మార్కెట్లు, తగ్గిన క్రూడ్ ఆయిల్ సామాన్యులకు ఊరటను అందిస్తుంటే.. మరోపక్క దీంతో పెరుగుతున్న బంగారం, వెండి రేట్లతో షాక్ అవుతున్నారు. నిన్నటి వరకూ తగ్గుతూపోయిన లోహాలు తిరిగి పుంజుకున్న వేళ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ ప్రాంతంలోని తాజా రేట్లను పరిశీలించండి.

మార్చి 10న బంగారం రేట్లు పెరిగాయి. దీంతో మార్చి 9 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.70 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 283గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 885గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 10, 2026న దేశవ్యాప్తంగా రేట్లు పెరిగాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.10వేలు పెరిగి రూ.3లక్షల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.