చైనా కంపెనీలకు గేట్లు తెరిచిన ఇండియా.. FDI రూల్స్లో భారీ సవరణలు

 చైనా కంపెనీలకు గేట్లు తెరిచిన ఇండియా.. FDI రూల్స్లో భారీ సవరణలు

ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. FDI రూల్స్ లో కీలక మార్పులు చేసింది. భారత్ తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనలను మరింత సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. 

చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మియన్మార్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాలు ఇండియాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ దేశాలకు చెందిన కంపెనీలు భారత్ లో 10 శాతంలోపు పెట్టుబడులకు ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్టుగా ఇన్వెస్ట్ చేసేలా నిబంధనలను మార్చింది కేంద్ర ప్రభుత్వం. 

మంగళవారం (మార్చి 10) ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సవరించిన పాలసీ ప్రకారం.. సరిహద్దు దేశాలకు చెందిన కంపెనీల ఓనర్లు భారత ప్రభుత్వ అనుమతి లేకుండానే నేరుగా ఇండియాలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆయా సెక్టార్ల నిబంధనలు మాత్రం వర్తిస్తాయి. గతంలో ఏ షేర్ హోల్డర్ అయినా ప్రభుత్వ అనుమతి ద్వారానే ఇండియాలో పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. 

►ALSO RRAD | ఇండిగో వరుస వైఫల్యాలు.. కంపెనీ సీఈవో రాజీనామా

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అవకాశవాద పెట్టుబడి దారులను నిరోధించేందుకు 2020 ప్రెస్ నోట్ 3 ద్వారా ఎఫ్​డీఐ ల విషయంలో కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. ముఖ్యంగాపొరుగు దేశాల అవకాశ వాద విధానాలను నిరోధించేందుకు ఈ నిబంధనలు తెచ్చారు. 

గతంలో ఉన్న నిబంధనల కారణంగా గ్లోబల్ ఫండ్ ఫ్లో ప్రభావితం అయ్యింది. ముఖ్యంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు రావడం కష్టంగా ఉండేది. దీంతో ఇండియాకు రావాల్సిన పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రస్తుతం నిబంధనలు మార్చడం ద్వారా విదేశీ పెట్టుబడులు పెరగటంతో పాటు టెక్నాలజీని షేర్ చేసుకోవడం, తయారీ రంగంలో వృద్ధి సాధించడంలో కలిసొస్తుంది భారత ప్రభుత్వం భావిస్తోంది.