ఇంధన సంక్షోభం ఎఫెక్ట్: మార్చి 12 నుంచి విమాన టికెట్ రేట్ల బాదుడు షురూ.. 

ఇంధన సంక్షోభం ఎఫెక్ట్: మార్చి 12 నుంచి విమాన టికెట్ రేట్ల బాదుడు షురూ.. 

అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన సంక్షోభం ప్రభావం చాలా దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పలు దేశాల్లో పెట్రోల్, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అనౌన్స్ చేశాయి కొన్ని దేశాలు. ఇదిలా ఉంటే.. ఇంధన సంక్షోభం ఎఫెక్ట్ విమాన టికెట్ రేట్లపై కూడా పడనుందని తెలుస్తోంది. జెట్ ఇంధన ధరలు పెరిగిన కారణంగా మార్చి 12 నుంచి టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా.

మార్చి 12 నుంచి డొమెస్టిక్ టికెట్ రేట్లపై రూ.399 సర్ ఛార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా.అదే విధంగా ఇంటర్నేషనల్ టికెట్లపై కూడా ఇంధన సర్ ఛార్జ్ పెంచనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తరహాలోనే మిగిలిన ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా టికెట్ రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. మరి, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.

►ALSO READ | చైనా కంపెనీలకు గేట్లు తెరిచిన ఇండియా.. FDI రూల్స్లో భారీ సవరణలు

ఇదిలా ఉండగా.. వరుస వైఫల్యాలతో విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదుపేసిన ఇండిగో సంస్థలో కీలక పరిణామం జరిగింది. తమ కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆయన రాజీనామా మంగళవారం (మార్చి 10) నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది.

సంస్థ నుంచి ఎల్బర్స్ తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో రాహుల్ భాటియా బాధ్యతలు తీసుకోనున్నారు. మధ్యంతర సీఈవోగా భాటియాకు బాధ్యతలు అప్పగించినట్లు మేనేజ్మెంట్ ప్రకటించింది. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యేలోపు కొనసాగుతారని యాజమాన్యం తెలిపింది.