లీడర్ల జెన్ జీ జపం..ఎమ్మెల్యే, ఎంపీ నుంచి ప్రధాని దాకా.. పొలిటీషియన్స్ అందరూ యూత్ మంత్రం

లీడర్ల జెన్ జీ జపం..ఎమ్మెల్యే, ఎంపీ నుంచి ప్రధాని దాకా.. పొలిటీషియన్స్ అందరూ యూత్ మంత్రం
  • ‘రాజకీయ ప్రసంగాల’ నుంచి రీల్స్​ వరకు యువ ఓటర్ల కోసం డిజిటల్ బాట
  • మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మీమ్​ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు.. బ్రో, రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుకీ, పోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇలా  రాజకీయాలన్నీ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాషలోనే..
  • రీల్స్​ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోదీ.. కూల్, క్యాజువల్ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ గాంధీ
  • ‘హాయ్​ ఫ్రెండ్స్​’ అంటూ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గరయ్యేందుకు ప్రధాని ప్రయత్నాలు
  • జెన్​జీ గొంతుకగా మారి ఆకట్టుకుంటున్న లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత
  • యువతతో టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భగవంత్​మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తేజస్వీ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  రేవంత్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • 2029 ఎలక్షన్స్​ లక్ష్యంగా యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అట్రాక్ట్​ చేసే పనిలో నేతలు
  • రాజకీయ యుద్ధభూమిగా మారిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్​

సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:దేశ రాజకీయాలు ఇప్పుడు  జెన్​ జీ జపం చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలనుంచి ప్రధాని వరకు  పొలిటీషియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరూ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాడి పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. రాజకీయ ప్రసంగాల నుంచి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టా రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు డిజిటల్ యుద్ధం చేస్తున్నారు. మన్​ కీ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి సీరియస్ ఉపన్యాసాల నుంచి మీమ్ కల్చర్ వరకు రాజకీయ సంభాషణ పూర్తిగా మారిపోయింది. 2029 సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటినుంచే ప్రధాన రాజకీయ నాయకులందరూ ఈ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ క్యాంపెయినింగ్ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దిగిపోయారు. దేశంలో ఓటర్లను గమనిస్తే, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటు హక్కు సాధించే వారిలో మెజారిటీ భాగం ‘జెన్- జీ’ (1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరం) యువతదే.

సాంప్రదాయ వార్తాపత్రికలు చదవని, టీవీ డిబేట్లు చూడని, మైకుల ప్రసంగాలను అస్సలు పట్టించుకోని ఈ తరాన్ని కనెక్ట్ చేసుకోవడం రాజకీయ నాయకులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఫలితంగా, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రాంతీయ నేతల వరకు ప్రతి ఒక్కరూ తమ పాత పద్ధతులను పక్కనబెట్టి 'జెన్-జీ' భాషలోకి, వారి డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. బ్రో, రిజ్‌‌‌‌, కుకీ, పోడ్‌‌‌‌కాస్ట్స్‌‌‌‌ .. ఇలా రాజకీయాలన్నీ ఇప్పుడు యూత్‌‌‌‌ భాషలోనే సాగుతున్నాయి. 

రోజుకో ఇన్ స్టా  రీల్​తో యూత్‌‌‌‌కు మోదీ రీచ్‌‌‌‌!  

నీట్ పేపర్‌‌‌‌‌‌‌‌ లీక్​ప్రధానాంశంగా దేశంలో ఉద్యోగాలు, విద్యావకాశాల కొరతపై ‘జెన్-జీ’  యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు సంచలనంగా మారాయి. జెన్​ జీ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో  యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  వినూత్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. యువతలో పెరిగిన అసంతృప్తిని చల్లార్చేందుకు ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా సెల్ఫీ వీడియోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ డిజిటల్ ప్రచారంతో అట్రాక్ట్​ చేసే ప్రయత్నం చేస్తున్నారు.  జెన్-జీ యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అత్యంత సహజ సిద్ధమైన  రీల్స్‌‌‌‌ను పోస్ట్ చేశారు. 

ముఖ్యంగా నీట్, పోటీ పరీక్షల లీకేజీల వివాదం వేళ ‘‘విద్యార్థుల బాధ నాకు తెలుసు’’ అంటూ ఆయన అర్ధరాత్రి వేళ ఓ సెల్ఫీ వీడియో వదిలారు. ‘హాయ్‌‌‌‌ ఫ్రెండ్స్’ అంటూ ఆయన మాట్లాడిన సెల్ఫీ వీడియో 24 గంటల్లోనే దాదాపు 303 మిలియన్ల వ్యూస్ సాధించగా.. ఆ తర్వాత వచ్చిన స్పందనకు ధన్యవాదాలు చెబుతూ ‘థ్యాంక్యూ ఫ్రెండ్స్‌‌‌‌’ అంటూ మరో రీల్‌‌‌‌ను విడుదల చేశారు. దీనికి తోడు సాధారణ పలకరింపులకు భిన్నంగా వర్టికల్ మోడ్‌‌‌‌లో ‘హాయ్ ఫ్రెండ్స్’ అంటూ క్యాజువల్‌‌‌‌గా మాట్లాడిన వీడియోతో పాటు ఆయన బైకర్ జాకెట్, కూలింగ్ గ్లాసెస్ ధరించి బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో ర్యాప్ మ్యూజిక్, ‘ఫ్రెండ్స్’ సిట్‌‌‌‌కామ్ థీమ్ సాంగ్‌‌‌‌లతో ఉన్న వినూత్న రీల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ప్రధాని మోదీ స్ఫూర్తితో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు కూడా లైట్ ఎడిటింగ్ వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ‘స్నాప్‌‌‌‌చాట్’  వేదికపైకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోని దాదాపు 40 కోట్ల మంది జెన్-జీ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మోదీ, బీజేపీ క్యాంపెయిన్ సాగుతోంది.  

జెన్​ జీకి సపోర్ట్​.. యూత్​ మోడ్​లోకి రాహుల్‌‌‌‌

లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక పూర్తిగా జెన్‌‌‌‌ జీ మోడ్​లోకి మారిపోయారు. యూత్‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌ అయ్యేందుకు సరికొత్త అవతారంలో అలరిస్తున్నారు. నేపాల్ నిరసనలు, ఓట్ల చోరీ ఆరోపణలపై మాట్లాడటంతో పాటు యువతతో వారి శైలిలోనే సంభాషించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  

సమావేశంలో విద్యార్థులు, యువకులు ఆయన్ను ‘సర్’ అని సంబోధించగా, రాహుల్ నవ్వుతూ ‘నన్ను బోరింగ్‌‌‌‌గా ‘సర్’ అని పిలవకండి, హాయిగా ‘బ్రో’ అని పిలవండి అంటూ వారితో చాలా సరదాగా, స్నేహపూర్వకంగా  మాట్లాడారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని సూచించే  ‘రిజ్’, అబద్ధం, నకిలీని తెలిపే క్యాప్​, కుకీలాంటి మరిన్ని పదాలతో యూత్​ను ఆకట్టుకున్నారు. తన యూట్యూబ్ చానెల్ ద్వారా కాలేజీ విద్యార్థులతో కలిసి సౌత్ ఇండియన్ ఫుడ్ తినడం, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్  ట్రిక్స్ నేర్పడం, ఫిట్‌‌‌‌నెస్ అండ్ ట్రావెల్‌‌‌‌ పట్ల తన అభిరుచిని ప్రదర్శించడం ద్వారా సీరియస్ పొలిటీషియన్ ఇమేజ్‌‌‌‌ను చెరిపేసి ‘యాక్సెసెబుల్ లీడర్’గా మారే ప్రయత్నం చేస్తున్నారు. 

నీట్​ పేపర్​ లీక్‌‌‌‌కు వ్యతిరేకంగా కాక్రోచ్​ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జంతర్​ మంతర్​ వద్ద జెన్​ జీ చేసిన నిరసనకు రాహుల్‌‌‌‌ సపోర్ట్​గా నిలిచారు. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు, పెల్లెట్​గన్ గాయాల పాలైన యువత ఆర్తనాదాలను పార్లమెంట్​ వేదికగా వినిపించారు. యువ నిరసనకారులతో మీడియా ముందు మోదీ సర్కారు దాష్టీకాన్ని బయటపెట్టారు. దీంతో జెన్​జీలో రాహుల్​కు క్రేజ్​ పెరిగింది. తమ గొంతు వినే నాయకుడనే పాజిటివ్​ ముద్ర పడింది. 

2029 ఎలక్షన్స్: ఓట్ బ్యాంక్ కాదు.. డిజిటల్ ఫాలోయింగ్!

భవిష్యత్తులో మొదటిసారి ఓటు వేయబోయే యువత అంతా ఇన్‌‌‌‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఆన్‌‌‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పత్రికల్లో వచ్చే వార్తల కంటే ఇన్‌‌‌‌స్టాలో చూసే 15 సెకన్ల రీల్ యువత అభిప్రాయాన్ని మార్చేస్తోంది. అందుకే రాజకీయ పార్టీలు కేవలం ఐటీ సెల్స్ మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా జెన్-జీ డిజిటల్ స్ట్రాటజిస్టులను, క్రియేటర్లను నియమించుకుని రూ. వందల కోట్లతో ఆన్‌‌‌‌లైన్ క్యాంపెయినింగ్ నడుపుతున్నాయి. ఓటు అడగడం అంటే సభలు పెట్టడం కాదు, యూత్‌‌‌‌తో డైరెక్ట్ డిజిటల్ కనెక్షన్ పెంచుకోవడమే అనే స్పష్టత నాయకుల్లో వచ్చింది. 

‘మీ ఫీడ్‌‌‌‌లో మేమున్నాం.. మీ భావాలకు ప్రతిరూపంగా మేమున్నాం’ అని నిరూపించుకోవడమే 2029 ఎన్నికల అసలు డిజిటల్ యుద్ధంగా మారబో తున్నది. అంటే సాంప్రదాయ ఓట్ బ్యాంకు రాజకీయాల నుంచి ‘డిజిటల్ ఫాలోయింగ్’, ‘సోషల్ ఎంగేజ్‌‌‌‌ మెంట్’ వైపు రాజకీయాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే,ఈ డిజిటల్ వ్యూహాలన్నీ కేవలం తాత్కాలికమైనవి కావని, రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి డిజిటల్ మీడియానే ప్రధాన ప్రచార మైదానంగా మారబోతున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ డిజిటల్ పరిణామం రాజకీయ ప్రక్రియను మరింత సరళంగా, సులభంగా మార్చినప్పటికీ, దీని వెనుక కొన్ని లోతైన ప్రశ్నలు కూడా ఉత్పన్న మవుతున్నాయి. 

15 సెకన్ల రీల్ లేదా ఒక ఫన్నీ మీమ్‌‌‌‌తో ఒక నాయకుడి సామర్థ్యాన్ని లేదా ఒక సంక్లిష్టమైన ప్రభుత్వ విధానాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెన్-జీ ఆకర్షణలో పడి అసలైన ప్రజా సమస్యలు (ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, విద్య) కేవలం ‘గ్లామరస్ కంటెంట్’కింద కొట్టుకుపోతున్నాయని అంటున్నారు. సోషల్ మీడియా అల్గారిథమ్‌‌‌‌లు సంచలనం, భావోద్వేగం ఉన్న కంటెంట్‌‌‌‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

 దీనివల్ల రాజకీయ నాయకులు నిర్మాణాత్మక చర్చల కంటే ‘వైరల్ కంటెంట్’ తయారీపైనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు.  ఏఐ డీప్‌‌‌‌ఫేక్స్, ఎడిట్ చేసిన షార్ట్ వీడియోల ద్వారా యువత అభిప్రాయాలను క్షణాల్లో తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీల్స్​ రాజకీయంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మోదీ వర్సెస్​ రాహుల్.. జెన్​ జీ మద్దతు ఎవరికంటే?

యువత ఎక్కువగా ఉండే ఇన్‌‌‌‌స్టా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌కు భారత్ అతిపెద్ద మార్కెట్‌‌‌‌గా ఉంది. ఈ క్రమంలో జెన్ జీ లేదా యువ ఓటర్ల దృష్టిని ఆకర్షిం చడంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీలో ఎవరు ముందున్నారనే ఆసక్తి కరమైన విశ్లేషణ తెరపైకి వచ్చింది. డేటా రిపోర్టల్ నివేదిక ప్రకారం, ఇన్‌‌‌‌స్టాగ్రామ్​ అడ్వర్టైజింగ్ ఆడియన్స్‌‌‌‌లో  35 ఏండ్లలోపు ఉన్నవారు ఇన్‌‌‌‌స్టాగ్రామ్ మొత్తం వ్యూయర్స్‌‌‌‌లో దాదాపు మూడింట రెండు వంతుల వరకు ఉన్నారు. 

అందువల్ల డిజిటల్ రాజకీయంలో  జెన్ జీ యుద్ధభూమిగా ఇన్‌‌‌‌స్టా మారింది. మోదీ ఇన్‌‌‌‌స్టాగ్రామ్​లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మైలురాయిని దాటి, ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలోవర్స్‌‌‌‌ ఉన్న నాయకుడిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. రాహుల్‌‌‌‌గాంధీకి 1.26 కోట్లకుపైగా ఫాలోవర్స్‌‌‌‌ ఉన్నారు. ఫేక్ లేదా బాట్ ఫాలోవర్లను మినహాయించినా మోదీకి  జెన్యూన్‌‌‌‌ ఫాలోవర్స్​ దాదాపు 8.5 కోట్ల నుంచి 9.5 కోట్ల వరకు ఉంటారని అంచనా. 

అదే రాహుల్ గాంధీకి 1.07 కోట్ల నుంచి 1.20 కోట్ల వరకు ఉన్నారు. ఈ లెక్కన రీచ్, ఫాలోవర్ల సంఖ్య పరంగా మోదీ, రాహుల్ గాంధీ కంటే 7 నుండి 9 రెట్లు ముందున్నారు. అయితే, ఎంగే జ్‌‌‌‌మెంట్​ రేట్​పరంగా చూస్తే మాత్రం మోదీ కంటే రాహుల్ ​గాంధీ మెరుగ్గా ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే, తమకు సపోర్ట్​ చేస్తుండడంతో జెన్‌‌‌‌ జీ కూడా ఆయనను ఎక్కువగా విశ్వసిస్తున్నట్టు తేల్చారు.  

జెన్​జీ ట్రెండ్‌‌‌‌లో కేంద్ర మంత్రులు, ప్రాంతీయ నేతలు

కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ఎస్. జైశంకర్, రాజీవ్ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌లాంటి వారు ప్రముఖ యూట్యూబ్ పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లలో గంటల తరబడి కూర్చొని దేశ విదేశాంగ విధానాలు, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ  భవిష్యత్తు గురించి సరళమైన ఇంగ్లిష్, హిందీలో మాట్లాడుతున్నారు. ఇది చదువుకున్న ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉన్న జెన్-జీ యువతను విశేషంగా ప్రభావితం చేస్తోంది.  జాతీయ నేతలే కాదు.. రాష్ట్రస్థాయి నాయకులు కూడా జెన్-జీ ట్రెండ్‌‌‌‌ను తెగ ఫాలో అవుతున్నారు. 
తెలంగాణ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తన మాస్ డైలాగ్స్, పొలిటికల్ పంచ్‌‌‌‌లను షార్ట్ వీడియోలుగా మార్చి రీల్స్ ద్వారా మాస్ అండ్ క్లాస్ యూత్‌‌‌‌కి ఒకేసారి రీచ్ అయ్యే వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారు. జెన్‌‌‌‌ జీని ఆకట్టుకోవడం ఎలా అనే అంశంపై సీఎం సీపీఆర్వోలతోపాటు మంత్రుల పీఆర్వోలకు జర్నలిజంలో ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ అయిన ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌తో ఇటీవల క్లాస్‌‌‌‌లు ఇప్పించారు. ప్రజా పాలనకు సంబంధించిన ప్రతి అప్​డేట్‌‌‌‌ను ఇన్‌‌‌‌స్టా సహా సోషల్​ మీడియాలో రీల్స్​గా ప్రచారం చేస్తున్నారు. 

తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్​ నేతలు సోషల్​ మీడియాలో జెన్​ జీని ఆకట్టుకునేలా మీమ్స్​తో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఇటీవల కాలంలో యువతతో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యూత్ పార్లమెంట్, యంగ్‌‌‌‌ మైండ్స్  ఇంటరాక్షన్, యువ సంగ్రామ సభలతో యూత్‌‌‌‌కు కనెక్ట్​ అవుతున్నారు. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో యువత అడిగే ప్రశ్నలకు క్యాజువల్ ఆన్సర్స్ ఇవ్వడంతోపాటు హైదరాబాద్ యూత్ కల్చర్‌‌‌‌కు తగ్గట్టు ట్రెండింగ్ రీల్స్ చేస్తూ యూత్‌‌‌‌లో ఫాలోయింగ్​ పెంచుకుంటున్నారు. 

బిహార్‌‌‌‌లో యువనేత తేజస్వీ యాదవ్ క్రికెట్ ఆడుతూ.. వాటిని క్యాజువల్ వీడియోలు చేయడం ద్వారా గ్రౌండ్ లెవెల్‌‌‌‌లో యూత్‌‌‌‌కి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ‘జన్ విశ్వాస్ యాత్ర’ ద్వారా గ్రామీణ యువకులతో కలిసి టీ తాగుతూ ఖాట్‌‌‌‌లపై ముచ్చటించడం, రాత్రి వేళల్లో క్యాంపింగ్ చేయడంలాంటి పనులు చేస్తున్నారు. జిమ్ వర్కౌట్స్, క్రికెట్ ప్రాక్టీస్, పాత కార్ డ్రైవింగ్ వీడియోలను ఇన్‌‌‌‌స్టాగ్రాం రీల్స్‌‌‌‌గా షేర్ చేస్తూ కూల్ అండ్ ఫిట్ లీడర్‌‌‌‌గా కనిపిస్తున్నారు. విద్యార్థులు, డిజిటల్ క్రియేటర్లు, స్టార్టప్ యువతతో ప్రత్యేక ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేసి, తమ ప్రభుత్వంలో ఇచ్చిన లక్షలాది ఉద్యోగాల అజెండాను వారి ముందుకు తీసుకెళ్తున్నారు. 

మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన పంచ్ డైలాగ్స్‌‌‌‌ను మీమ్ కల్చర్‌‌‌‌కి తగ్గట్టుగా మార్చి సోషల్ మీడియాలో హల్‌‌‌‌చల్ చేస్తున్నారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్​ఆద్మీ పార్టీ (ఆప్​) కన్వీనర్ అర్వింద్‌‌‌‌ కేజ్రీవాల్ ‘బిజినెస్ బ్లాస్టర్స్’ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థుల స్టార్టప్ ఐడియాలకు ఫండింగ్ ఇస్తూ, స్వయంగా వారితో బిజినెస్ పిచ్‌‌‌‌లపై ముచ్చటిస్తున్నారు. ప్రముఖ యంగ్ పోడ్‌‌‌‌కాస్టర్లు, యూట్యూబర్ల ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఐటీ, విద్య, ఉపాధిపై క్యాజువల్ డిస్కషన్స్ చేస్తున్నారు.