H1B వీసా హోల్డర్లకు బిగ్ షాక్.. ఉద్యోగం కోల్పోతే.. అమెరికాను వీడాల్సిందే

H1B వీసా హోల్డర్లకు బిగ్ షాక్.. ఉద్యోగం కోల్పోతే.. అమెరికాను వీడాల్సిందే
  • హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుపై డీహెచ్ఎస్ యోచన

అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు ఉండే 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును ఎత్తివేయాలని డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ హోమ్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) యోచిస్తున్నది. సాధారణంగా అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు మరో ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తమ వీసా హోదా మార్చుకోవడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్​ను వాడుకుంటారు. అయితే, వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లోని ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ బడ్జెట్’.. ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నది.

వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాదారులకు ఉండే 60 రోజుల గ్రేస్ పీరియడ్ వెసులుబాటును ఎత్తివేయాలని డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ హోమ్‌‌‌‌‌‌‌‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) యోచిస్తున్నది. సాధారణంగా అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు మరో ఉద్యోగం వెతుక్కోవడానికి, తమ వీసా హోదా మార్చుకోవడానికి 60 రోజుల వెసులుబాటు (గ్రేస్ పీరియడ్) ఉంటుంది. 

యితే, వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లోని ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ బడ్జెట్’.. ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నది. ఒకవేళ 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించాలనే ప్రపోజల్ అమల్లోకి వస్తే.. ఉద్యోగం కోల్పోయిన మరుక్షణమే వీసాదారులు తమ చట్టబద్ధమైన హోదాను కోల్పోతారు. ముఖ్యంగా అమెరికాలోని హెచ్-1బీ వీసాదారుల్లో సుమారు 71 శాతం ఉన్న భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా పడనుంది. 

వారంతా వీసా గడువు ముగిసిన వెంటనే అమెరికాను వీడాల్సి ఉంటుంది.  ఈ ప్రతిపాదన ఫెడరల్ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌లో ప్రచురితమైన తర్వాత.. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించడానికి కనీసం 30 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి హెచ్-1బీ వీసాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ భవిష్యత్తులో వచ్చే మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.