టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్..? బంగ్లా బాటలోనే దాయాది దేశం..!

టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్..? బంగ్లా బాటలోనే దాయాది దేశం..!

న్యూఢిల్లీ: 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్​ వైదొలిగిన విషయం తెలిసిందే. భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో పర్యటించలేమంటూ ఆ జట్టు టోర్నీని బహిష్కరించింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే నడవనుందని.. దాయాది దేశం కూడా టీ20 టోర్నీని బహిష్కరించే యోచనలో ఉన్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

తమ మిత్ర దేశం బంగ్లాదేశ్‎కు మద్దతుగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుందట. భారత్, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్‎ ఆడాలా..? బాయ్ కాట్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోందట.

ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మీడియాతో మాట్లాడుతూ.. తమ జట్టు టీ20 వరల్డ్ కప్‎లో పాల్గొనాలా వద్దా అనేది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ద్వారా నిర్దేశించబడుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని.. ఆయన తిరిగిచ్చాక ఈ అంశంపై డిస్కస్ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వరల్డ్ కప్‎లో ఆడాలా వద్దా అనేది స్పష్టం చేస్తామని చెప్పారు. తమ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వంపైన ఆధారపడి ఉంటుందని.. ఐసీసీపై కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నఖ్వీ వ్యాఖ్యలతో మెగా టోర్నీలో పాకిస్తాన్ పార్టిసిపేషన్‎పై సందిగ్ధం నెలకొంది.

అయితే.. పాక్ టోర్నీ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచులను ఐసీసీ ఇండియా బయటే నిర్వహిస్తోంది. ఈ విషయంలో దాయాది దేశానికి ఎలాంటి సమస్య లేదు. కాకపోతే బంగ్లాదేశ్‏కు మద్దతుగా టోర్నీ బహిష్కరించాలనుకుంటే మాత్రమే చేసేదేమి లేదు. ఒకవేళ వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్ధికంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీబీ అంత డేర్ చేయకపోచ్చని సమాచారం.

బంగ్లాదేశ్‎కు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‎ను టీ20 వరల్డ్ కప్ నుంచి భర్తరఫ్ చేసింది. గ్రూప్-సీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‎కు అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం (జనవరి 24) ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. 

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాలు సాకుగా చూపి ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడలేమంటూ బంగ్లాదేశ్ ఐసీసీకి చెప్పింది. తమ మ్యాచులను ఇండియా బయట వేదికలకు తరలించాలని లేదంటే గ్రూప్ అయినా మార్చాలని ఐసీసీని అభ్యర్థించింది. 

ALSO READ | పిల్లకూన బంగ్లాదేశ్‎ను టీ 20 వరల్డ్ కప్ నుంచి తీసిపారేసిన ఐసీసీ

ఇప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇండియాలో ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పింది. లేదంటే మీ ఇష్టం అంటూ జనవరి 23వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. ఈ లోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇండియాలో ఆడేందుకు ఒప్పుకోలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‎ను తీసి పడేసింది ఐసీసీ. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‎కు అవకాశం కల్పించింది.