Kuldeep Yadav: భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు కుల్‌దీప్. ఇప్పుడు ఈ మెగా టోర్నమెంట్ ముగియడంతో పెళ్లి మాట మళ్లీ తెర మీదకి వచ్చింది. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో మార్చి 14వ తేదీ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఓ రిసార్ట్‌లో కుల్‌దీప్ పెళ్లి జరగనుంది. మార్చి 17వ తేదీన లక్నోలో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కుల్‌దీప్ యాదవ్, వన్షికలకు గతేడాది జూన్ 4వ తేదీన నిశ్చితార్థం జరగగా.. ఆమె తండ్రి ఎల్ఐసీ ఉద్యోగి, నిజానికి ఈ వివాహం గతేడాది నవంబర్‌లోనే జరగాల్సి ఉన్నప్పటికీ.. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో వాయిదా పడింది.
►ALSO READ | T20 World Cup Trophy: వరల్డ్ కప్ ట్రోఫీ ‘పబ్లిక్ ప్రాపర్టీ’ అయిందా?.. ఆటగాళ్ల ఫ్యామిలీ, లవర్స్ ఫోటోలపై ఫ్యాన్స్ ఫైర్!
కాగా కుల్‌దీప్ యాదవ్ తండ్రి రామ్‌సింగ్ యాదవ్ మార్చి 8వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని వ్యక్తిగతంగా కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశాడు. అయితే కుల్‌దీప్, వన్షిక ఇద్దరూ కాన్పూర్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఇద్దరి ఇళ్లు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో చిన్నప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. అత్యంత త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుంది.
ఇక ఈ పెళ్లి వేడుకకు బీసీసీఐ అధికారులు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు హాజరయ్యే ఛాన్‌స్ ఉంది. కుల్‌దీప్ యాదవ్ దీర్ఘకాల కోచ్ కపిల్ దేవ్ పాండే తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 13వ తేదీన హల్దీ, మెహందీ కార్యక్రమాలతో ఈ పెళ్లి వేడుకలు స్టార్ట్ అవుతాయి. అయితే 2026 టీ20 ప్రపంచకప్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1/14 గణాంకాలతో సత్తా చాటారు.
