బరితెగించిన బంగ్లాదేశ్‌కు.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ఐసీసీ. టీ 20 వరల్డ్ కప్‌లో ఇండియా గడ్డపై ఆడనంటూ అల్టిమేటం ఇచ్చి.. అతి పెద్ద తప్పు చేసింది బంగ్లాదేశ్. పిల్లకూన బంగ్లాకే ఇంత ఉంటే.. భారత్‌కు ఎంత ఉండాలి.. ఇండియాకు ఇంకెంత పౌరుషం ఉండాలి. పిల్లకూన బంగ్లాకు దిమ్మతిరిగే విధంగా.. టీ 20 వరల్డ్ కప్ నుంచే బంగ్లాను తరిమి కొట్టింది ఐసీసీ. పద్దతిగా.. చెప్పినట్లు ఇండియా గడ్డపై క్రికెట్ మ్యాచులు ఆడితే ఓకే.. లేకపోతే వరల్డ్ నుంచి తీసిపారేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ.
పొగరు తలకెక్కిన బంగ్లా జట్టు.. ససేమిరా అనటంతో.. టీ 20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాను తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఐసీసీ. ఆ వెంటనే.. బంగ్లాదేశ్ స్థానంలో ఆడే మరో జట్టును ప్రకటించింది. ఆ దేశం స్కాట్లాండ్. ఇప్పుడు అధికారికంగా టీ 20 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టి.. ఇండియా గడ్డపై ఆడనుంది.
బంగ్లాదేశ్‌కు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి భర్తరఫ్ చేసింది. గ్రూప్-సీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం (జనవరి 24) ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాలు సాకుగా చూపి ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులు ఆడలేమంటూ బంగ్లాదేశ్ ఐసీసీకి చెప్పింది. తమ మ్యాచులను ఇండియా బయట వేదికలకు తరలించాలని లేదంటే గ్రూప్ అయినా మార్చాలని ఐసీసీని అభ్యర్థించింది.
ఇప్పటికే వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు కావడంతో బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చింది. ఇండియాలో ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పింది. లేదంటే మీ ఇష్టం అంటూ జనవరి 23వ తేదీ వరకు డెడ్ లైన్ విధించింది. ఈ లోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇండియాలో ఆడేందుకు ఒప్పుకోలేదు. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తీసి పడేసింది ఐసీసీ. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది.
స్కాట్లాండ్ తమ నాలుగు గ్రూప్ లీగ్ మ్యాచ్‌లను వెస్టిండీస్ (ఫిబ్రవరి 7), ఇటలీ (ఫిబ్రవరి 9) మరియు ఇంగ్లాండ్ (ఫిబ్రవరి 14) లతో కోల్‌కతాలో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌తో ఒక మ్యాచ్ ఆడుతుంది.
ALSO READ : బంగ్లా ప్లేస్‌లో స్కాట్లాండ్!
