ఆధ్యాత్మికం: జయ ఏకాదశి విష్ణమూర్తికి చాలా ఇష్టం..ఇలా చేస్తే లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది..కష్టాలు పరార్.. ..!

ఆధ్యాత్మికం: జయ ఏకాదశి విష్ణమూర్తికి చాలా ఇష్టం..ఇలా చేస్తే  లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది..కష్టాలు పరార్.. ..!

పురాణాల ప్రకారం  ఏకాదశి తిథి ఎంతో పవిత్రమైనది.  ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి.  అన్ని వ్రతాలకన్నా.. ఏకాదశి వ్రతం చాలా విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది (2026)  మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి ( జనవరి 29  రోజున  రవియోగం ఏర్పడుతుంది. ఈ రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని.. ఇంకా కష్టాలు .. సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.

ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. 2026 సంవత్సరంలో మాఘ మాసంలో వచ్చే ‘జయ ఏకాదశి’ వ్రతం విశేషమైన ‘రవి యోగం’లో రానుందని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల  ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని.. అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు. 

జయ ఏకాదశి ముహూర్తం వివరాలు

 ఏకాదశి తిథి ప్రారంభం : జనవరి 28 సాయంత్రం 4.35 గంటలకు 
ఏకాదశి తిథి ముగింపు: జనవరి 29  మధ్యాహ్నం 01:55 గంటలకు.
జనవరి 29న ఏకాదశి సూర్యోదయ తిథి ఉండటం వల్ల ఆ రోజే వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు. 

జయ ఏకాదశి పూజా విధానం

జయ ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేవండి. 
 లక్ష్మీ నారాయణులకు నమస్కరించండి.
ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేయాలి. 
సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి, పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలను లేదా ఫోటోను ప్రతిష్టించాలి. 
స్నానం చేసి, ధ్యానం చేసి, మీ నీటితో ఆచమన చేయండి. 
ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడానికి పసుపు రంగు దుస్తులు ధరించండి. 
పసుపు రంగు పండ్లు, పువ్వులు, ఖీర్ తెలుపు స్వీట్లను కూడా దానం చేయండి. 
 విష్ణు చాలీసా పఠించాలి. చివరికి, హారతి చేసి,  సంపద కోసం విష్ణువును ప్రార్థించండి.
రాత్రి భజన కీర్తనలతో జాగరణ చేయడం మంచిది
మరుసటి రోజు (ద్వాదశి) ఉదయం పూజ ముగించుకుని, బ్రాహ్మణులకు లేదా పేదలకు దానధర్మాలు చేసిన తరువాత భోజనం చేయాలి. 

జయ ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారు ?

జయ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. అంతేకాకుండా అకాల మృత్యు భయం తొలగిపోవడమే కాకుండా, మరణానంతరం మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. ఈ వ్రతం వల్ల పితృదేవతలకు శాంతి చేకూరి, వారి ఆశీస్సులు లభిస్తాయి. అంతే కాదు సంధ్యా సమయంలో ( సాయంత్రం) తులసి కోట దగ్గర దీపారాధనచేసి.. విష్ణుసహస్రనామం పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | 2 వారాలు చక్కెర మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా ? మీ ముఖం, పొట్ట, లివర్ లో వచ్చే మార్పులు ఇవే!

జయ  ఏకాదశి  వ్రతాన్ని ఆచరించేవారు బాధల నుంచి దూరమవుతారని చెబుతున్నారు. ఈ విషయాల గురించి పద్మ పురాణంలో శ్రీ కృష్ణ భగవానుడు ప్రస్తావించాడని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఆ రోజు  చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. శ్రీ కృష్ణ భగవానుడు యుధిష్ఠిరునికి ఈ వ్రతమును గురించి చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించిస్తే బ్రహ్మ హత్యా పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో  పాటు ఆధ్యాత్మిక పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న సమస్యలకు ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.