ఎవరైనా ఏదైనా పని చేస్తే.. అది ఇతరులకు నచ్చకపోతే తప్పు చేశామంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి లేదు.. లేదు అంటాం. ఇంకొన్నిసార్లు అది తప్పే' అని మనం ఒప్పుకుంటాం. పశ్చాత్తాప పడతాం. మనం ఎక్కువసార్లు జీవితాన్నే భయపెడుతుంటాం.
అయితే, కొన్ని తప్పుల్ని మర్చిపోతాం. కొన్ని మర్చిపోం! ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఫ్యాన్ ఆఫ్ చేయడం మర్చిపోవడం కూడా తప్పే అంటాం. మతి మరుపు. పరధ్యానం, అజాగ్రత్త, భయం, కోపం ఇవన్నీ తప్పుని సమర్థిస్తాయి. అయితే, సడన్ గా ఇల్లు మారడం, ఉద్యోగానికి రాజీనామా చేయడం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అది పశ్చాత్తాపానికి, నిరాశకు, డిప్రెషన్ కు కారణమవుతుంది.
కాబట్టి, ఆశకు ఇంకేదైనా ఆశ్రయం ఉందా? అని ఆలోచించాలి. 'అసలు తప్పులనేవే ఉండవు. ఉండేవి కేవలం అనుభవాలే. అసలు సమస్యలనేవే ఉండవు. ఉండేవి కేవలం సవాళ్లే!' అంటాడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా జేపీ వాస్వానీ, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, పునరాలోచించుకోవడానికి మనం చేసే తప్పులే ప్రేరణ కలిగిస్తాయి.
దాని తాలూకు అనుభవాలు మనల్ని వినయంగా, తెలివేనోళ్లుగా తీర్చిదిద్దుతుంది. అందుకే ప్రతి తప్పుని ఒక అనుభవంగా భావించాలే తప్ప.. తనను తాను నిందించుకోవడం.
తనపై తాను జాలిపడటం లాంటివి.. చేయకూడదు.
పరిస్థితుల్ని లొంగదీసుకోవడం, మళ్లీ కొత్తగా మొదలు పెట్టడం లాంటి ముఖ్యమైన విషయాల్లో ప్రేరణ కలిగించడానికి మనకు ప్రకృతిలో ఎన్నో జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే, ఈ రీలొకేషన్ కొంత ఒత్తిడికి కారణం కావొచ్చు. కానీ, బతకడానికి అదే మూలం! ప్రకృతి ఎప్పుడూ జీవికి తన సహాయసహకారాలు అందిస్తూనే ఉంటుంది. కొత్త ప్రదేశం జీవితం తాలూకు అందాన్ని అన్వేషించడానికి ఒక అవకాశం కల్పిస్తుంది. అకాల బాధలు, అకాల కలతలు మనిషిని కుదిపేస్తాయి. కానీ, అది మన కోసం తెరిచే అవకాశాల తలుపుల గురించి ఆలోచించాలి.
ఒక పెద్ద కార్పొరేట్ ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినప్పుడు చాలా డిజప్పాయింట్ అవుతాడు. కానీ, ఆ రోజు అతను వెనక్కి తిరిగి చూసుకుంటే.. “నేను ఇంటర్వ్యూ వరకూ వచ్చానంటే కచ్చితంగా ఆశీర్వాదమే! నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూ వరకు రానే లేదు' అంటాడు. అంటే, తన తప్పుని అనుభవంగా భావించగలిగితే.. ఆ జాబ్కి అతను ఇంకొక్క అడుగు దూరంలోనే ఉన్నాడన్నమాట!
-వెలుగు,లైఫ్-
